దళిత బిడ్డ వసంతకు డాక్టరేట్

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పెంచికల్ దిన్నె గ్రామానికి చెందిన నందిపాటి వసంత కు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ లభించింది. ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల విభాగం ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ లోని ఎన్విరాన్మెంటల్ సైన్స్ ( పర్యావరణ శాస్త్రం) ఈ విభాగంలో ప్రొఫెసర్ సి.వెంకటేశ్వర్ పర్యవేక్షణలో ” ది ఎఫెక్ట్ ఆఫ్ ట్రీటెడ్ అన్ ట్రీటెడ్ హుస్సేన్ సాగర్ వాటర్ అండ్ బోర్ వాటర్ ఆన్ లేబియో రోహిత ” అనే అంశంపై పరిశోధన పూర్తి చేసి గ్రంధాన్ని సమర్పించింది. ఈ సందర్భంగా వసంత కు ఓయూలోని పలువురు అధ్యాపకులు, పరిశోధనా విద్యార్థులు అభినందనలు తెలుపుతున్నారు . వసంత భర్త ( కందుల శ్రీను – సీనియర్ జర్నలిస్ట్ హైదరాబాద్ ) వసంత విద్యాభ్యాసం ఒకటి నుండి పది వరకు పెంచికల్ దిన్నె గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్, డిగ్రీ మిర్యాల గూడా, హైదరాబాద్ కూకట్ పల్లి జె.ఎన్.టి.యు క్యాంపస్ లో ఎన్విరాన్మెంటల్ సైన్స్ (పర్యావరణ శాస్త్రం) విభాగంలో ఎమ్మెస్సీ పూర్తిచేసింది. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్విరాన్మెంటల్ సైన్స్ విభాగంలో పి హెచ్ డి పూర్తి చేసింది. ఉన్నతమైన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి పూర్తి చేసినందుకు గాను తన స్నేహితులతో పాటు గ్రామ టీచర్స్, జర్నలిస్టులు, గ్రామ పెద్దలు పలువురు అభినందనలు తెలిపారు.