ఒమిక్రాన్‌పై గందరగోళ వార్తలు !
ఏదినిజం..కరోనా విషయంలో శాస్త్రవేత్తల వివరాలు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఒమిక్రాన్ పెద్దగా ప్రమాదకారి కాదని దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు అంటుంటే…అది ప్రమాదకారే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. జర్మనీ, బ్రిటన్, అమెరికన్ ,భారత్ శాస్త్రవేత్తల అధ్యయానికి పొంతన కుదరడం లేదు. కొందరు ఇది తీవ్రంగా ప్రభావం చూపుతుందని అంటుంటే మరికొందరు కాదని అంటున్నారు. ఈ క్రమంలో ఏది నిజమన్నది ఇప్పుడు ప్రజల్లో మరింత ఆందోళనకు గురి చేస్తోంది.
ఒమిక్రాన్ తీవ్రత పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా కేసులు కూడా గతంలో ఎప్పుడూ లేనంతగా పెరుగుతున్నాయి. అమెరికాలో లక్షల్లో కరోనా కేసుల నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా లక్షణాలు స్వల్పంగా ఉన్నప్నటికీ వైరస్‌ను లైట్ తీసుకోవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒమిక్రాన్ తేలిక పాటి లక్షణాలే అంటూ తేలికగా తీసుకుంటున్న తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర హెచ్చరిక చేసింది. ఒమిక్రాన్ కూడా ప్రాణాంతక మైన వేరియంటే అని ప్రకటించింది.
ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఆసుపత్రుల్లో బాధితులు అవస్థలు పడుతున్నారనీ, మరణాలు కూడా నమోదవుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధానమ్ వెల్లడి౦చారు. కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. వేరియంట్ బయటపడిన దక్షిణాఫ్రికాలో ఆసుపత్రిపాలయ్యే పరిస్థితి, మరణాల రేటు తక్కువగానే ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ నిపుణుడు డాక్టర్ అబ్దీ మహముద్ తెలిపారు. అయితే అన్నిచోట్ల ఇదే తరహాలో ఉంటుందని భావించలేమని వెల్లడిరచారు. గతంలో ఎన్నడూలేనంతగా ఒమిక్రాన్‌లో సాంక్రమికశక్తి కనిపిస్తోందని పేర్కొన్నారు.
అమెరికాలో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని.. హాస్పిటల్స్‌లో చేరే పరిస్థితులు కూడా ఎక్కువగానే ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. పాత వేరియంట్లు తీవ్రమైన న్యూమోనియా కు దారితీసి ఊపిరితిత్తుల పనితీరుపై ప్రభావం చూపగా.. ఒమిక్రాన్ శ్వాస వ్యవస్థ పైభాగంలో ప్రభావం చూపుతున్నట్లు అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయని చెప్పారు. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 128 దేశాల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడినట్టు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది.
కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నవారు కూడా వైరస్ బారిన పడుతుండటం తో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీంతో వ్యాక్సిన్ల పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతు న్నాయి. వ్యాక్సిన్‌ల సమర్థతను అనుమానించాల్సిన అవసరం లేదని అమెరికాలోని మిన్నెసోటా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు లూయిస్ మాన్‌స్కీ వెల్లడిరచారు. వ్యాక్సిన్ తీసుకున్నా.. నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. వాస్తవానికి కరోనా బారిన పడినప్పటికీ తీవ్ర అనారోగ్యానికి గురికాకుండా రక్షణ కల్పించేం దుకే వ్యాక్సిన్‌లను రూపొందించారని అన్నారు.
వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా కరోనా బారినపడటానికి గల కారణాలను ఆయన వివరించారు. వ్యాప్తి తీవ్రత అధికంగా ఉన్న ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రావడం మొదటిదైతే.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సెలవుల సీజన్ కావడంతో ప్రయాణాలు అధిక మవడంతో వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా వైరస్ బారిన పడుతున్నారని వివరించారు. వ్యాక్సిన్ తీసుకున్నాం గనుక కరోనా సోకే అవకాశం లేదనే అపోహతో చాలా మంది కరోనా నిబంధనలు పాటించడం లేదని లూయిస్ హెచ్చరించారు.
కరోనా బారిన పడినప్పటికీ స్వల్ప లక్షణాలే ఉండటంతో వ్యాక్సిన్‌లు తమ పనిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయని స్పష్టం చేశారు. బూస్టర్ డోసు తీసుకున్నవారికి ఇంకా మెరుగైన రక్షణ లభిస్తుందని వివరించారు. భారతదేశంలో కొవిడ్ మరణాలు.. అధికారికంగా వెల్లడిరచిన దానికన్నా 6`7 రెట్లు అధికంగా ఉండొచ్చని అంతర్జాతీయ పరిశోధకుల బృందం అధ్యయనంలో వెల్లడైంది. 2022 జనవరి 1 నాటికి కేంద్రం అధికారికంగా వెల్లడిరచిన గణాంకాల ప్రకారం దేశంలో కొవిడ్ మరణాల సంఖ్య 4.8 లక్షలు. కానీ, 2021 సెప్టెంబరు నాటికే దేశంలో 32 లక్షల మంది కొవిడ్ కారణంగా మరణించినట్టు ఒక స్వతంత్ర సర్వే, ప్రభుత్వానికి సంబంధించిన రెండు డేటా సోర్సుల ఆధారంగా తాము చేసిన అధ్యయనంలో వెల్లడైందని పరిశోధకులు పేర్కొన్నారు.
యూనివర్సిటీ ఆఫ్ టొరంటో ప్రొఫెసర్ ప్రభాత్ రaా నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయన నివేదిక సైన్స్ జర్నల్‌లో గురువారం ప్రచురితమైంది. 2020 మార్చి నుంచి 2021 జూలై దాకా దేశంలోని అన్ని రాష్టాల్రు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 1,37,289తో సీ`వోటర్ సంస్థ టెలిఫోన్ సర్వే నిర్వహించింది. ఆ సర్వే సమాచారాన్ని, ప్రభుత్వానికి సంబంధించిన రెండు డేటా సోర్సులను ఈ అధ్యయనంలో వాడుకున్నారు. దేశంలో గడిచిన ఎనిమిది రోజుల్లో కేసుల సంఖ్య 6.3 రెట్లు పెరిగింది!
దేశవ్యాప్తంగా కేసులు భారీగా పెరిగిపోతున్నాయని.. ముఖ్యంగా నగరాల్లో కొవిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని.. వస్తున్న కేసుల్లో అత్యధికం ఒమైక్రాన్‌వేనని.. కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అలాగని భయాందోళనలకు గురికావాల్సిన పని లేదని.. ప్రజలంతా అప్రమత్తంగా, సన్నద్ధంగా ఉండాలని సూచించింది. మూడోవేవ్ ముప్పును సమర్థంగా ఎదుర్కోగలమని ధీమా వ్యక్తం చేసింది. జనవరి 4న ప్రపంచవ్యాప్తంగా 25.2 లక్షల కేసులు నమోదయ్యాయని.. కరోనా మహమ్మారి వ్యాపించినప్పటి నుంచి ఒకే రోజు ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి అని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
ఇకపోతే ఫిబ్రవరిలో గరిష్ఠ మరణాలు నమోదవుతాయని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత నెలరోజులకు తగ్గుముఖం పడతాయని వారు పేర్కొ న్నారు. అయితే, సెకండ్ వేవ్‌తో పోలిస్తే మరణాల సంఖ్య 30 నుంచి 50 శాతం తక్కువగా ఉంటుందని వివరించారు. మొత్తంగా ఇప్పుడు ఒమిక్రాన్ పై రకరకాల వాదనలు వస్తున్న తరుణంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. అలాగే కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. పండగల వేళ ప్రజలు మరింత అప్రమ త్తంగా ఉండక్పోతే మరణాల సంఖ్య కూడా పెరిగే ప్రమాదం లేకపోలేదు. అజాగ్రత్తలే కొంప ముంచుతాయి.