వ్యక్తిగత మరుగుదొడ్లపై ఇంకా అస్పష్టతే
ప్రకటనలు ఇస్తున్నా దక్కని ఆశించిన ఫలితం
గ్రామాల్లో మరింతగా చైతన్యం రావాల్సిందే
దేశవ్యాప్తంగా వ్యక్తిగత మరగుదొడ్ల నిర్మాణం కోసం టీవీల్లో జోరుగా ప్రకటనలు ఇస్తున్నారు. ఇన్నేళ్లయినా ఇంకా ఆశించన లక్ష్యాన్ని చేరుకోవడం లేదనడానికి ఇదే నిదర్శనం. గ్రామసీమల్లోని 42 శాతం జనాభాకు నేటికీ మరుగుదొడ్లు కరవైన పరిస్థితిలో, కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలూ వాటి నిర్మాణ నిర్వహణల్ని ఓ సవాలుగా భావిస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్టాల్ల్రో కొన్ని జిల్లాల్ని ఓడీఎఫ్‌లుగా ప్రకటించింది. వార్డు కమిటీలు, స్వయంసహాయక సంఘాలు, పట్టణ సమాఖ్యల ఉమ్మడి కృషితో జనగామ అనతికాలంలోనే లక్ష్యం సాధించింది.
కూలిపనులు చేసి సంపాదించిన సొమ్ముతో మరుగుదొడ్లు నిర్మించుకొనిఇతర ప్రాంతాలవారికి ఆదర్శ ప్రాయులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో 46శాతం ప్రజలు మరుగుదొడ్లు ఉపయోగిస్తున్నారు. దీనిఇకతోడు పరిశుభ్రతకు సంబంధించిన పనులు తమకు సంబందించినవి కావన్న ధోరణిలో ప్రజలు ఉన్నారు.
పరిశుభ్రతా సాధనలో భాగంగా, శౌచాలయ వ్యవస్థపై ఎనలేని కేంద్రం శ్రద్ధ చూపుతోంది. బహిరంగ మలవిసర్జన రహిత ఊళ్లు, ఇంటింటా మరుగుదొడ్లు’ ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యక్రమాలు చేపట్టి ఇప్పటికి మూడేళ్లు గడిచాయి. ఏపీ ప్రభుత్వం వివిధ విభాగాలవారితో ప్రచార బృందాల్ని ఏర్పాటుచేసి, మారుమూల గ్రామాలకీ పంపించీ అవగాహన పెంచేందుకు కృషిచేస్తోంది. ఏపీలోని అనేక గ్రామాలు బహిర్భూమి సమస్య నుంచి సంపూర్ణంగా బయట పడ్డాయని కేందప్రభుత్వ ఆధ్వర్యంలోని పారిశుద్ధ్య మంత్రిత్వశాఖ ఇదివరకే వెల్లడి౦చింది.
మొత్తం 72లక్షల మరుగుదొడ్లు అవసరమైన ఏపీలో ఇప్పటికే 44.1 లక్షల నిర్మాణాలు పూర్తయ్యాయి. వాటి ఏర్పాటుతో పాటు వినియోగమూ ముఖ్యమంటూ వందల సంఖ్యలో సదస్సులు నిర్వహించారు. పాఠశాలల్లో మరుగదొడ్ల ఏర్పాటును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి ప్రాథమ్యంగా ప్రకటించింది.
ప్రభుత్వాల, ప్రజల ఆలోచనా ధోరణిని బట్టే శౌచాలయ నిర్మాణ పక్రియ ముందుకు సాగుతుంది. ఉమ్మడి భాగస్వామ్యమే స్వచ్ఛతను, శుభ్రతను సాకారం చేస్తుంది.అందుకు అనుగుణంగా అవసరమైతే కఠినచర్యలు తీసుకోవాలి. స్వచ్ఛతకు సంబంధించి ప్రజల్లో చైతన్యంతో పాటు కఠిన నిబంధనలు అమల్లోకి రావాలి. దీనిని తప్పనిసరి చేయడం ద్వారానే లక్ష్యం సాధించగలం. ప్రజల్లో నిర్లిప్తత తొలగాలి. పరిశుభ్రత పాటించకపోతే వ్యక్తిగతంగా తమకు, తద్వారా సమాజానికి చేటు జరగుతుందన్న విషయం ప్రచారం చేయాలి.
ప్రజలను నిరంతర చైతన్యం చేయడం ద్వారానే సంపూర్ణ స్వచ్ఛత సాధించగలమని గుర్తించాలి. ప్రజాప్రతినిధులు, అధికారుల ఆశయానికి అడుగులు పడుతున్నాయి.అధికారుల కృషితో నియోజకవర్గంలో నూరు ఓడీఎఫ్ దిశగా అడుగులు పడుతున్నాయి. సవిూక్షలు, సమావేశాలు నిర్వహించి సర్పంచ్‌లను పురమాయించడంతో మరుగుదొడ్ల నిర్మాణాలపై ప్రజలు దృష్టి సారించారు. దీంతో గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు ఉద్యమంలా సాగుతున్నాయి. ఓడీఎఫ్ సాధించేందుకు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తూ సంక్షేమ పథకాలను కట్ చేస్తూ మరుగుదొడ్ల నిర్మాణాలను ఉద్యమంలా చేపట్టారు.