వైద్య రంగం లో జిల్లా కేంద్రం అభివృద్ది..మంత్రి జగదీష్ రెడ్డి
జీవన వైద్యశాలలో పేద ప్రజలకు మెరుగైన సేవలు అందాలి
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
సూర్యాపేట: రోజురోజుకూ వైద్యరంగంలో జిల్లా కేంద్రం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక కుడకుడ రోడ్డులో ఏర్పాటు చేసిన జీవన వైద్యశాల ను ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవన వైద్యశాల సేవలు సామాన్యులకు అందుబాటులో ఉండాలన్నారు. పేద ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. జీవన వైద్యశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమళ్ల అన్నపూర్ణ శ్రీనివాస్, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ, నాయకులు వైవి, ఉప్పల ఆనంద్,స్థానిక కౌన్సిలర్ అభినయ్, జహీర్,ప్రముఖ వైద్యులువెంకట రమణ, హర్షవర్ధన్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.