చంపుతామంటున్నారు…రక్షణ కల్పించండి…
– ప్రైవేటు జాబ్ కన్సల్టెన్సీ నిర్వాహకుడి ఆవేదన
సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన కొందరు పెద్ద మనుషులు కలిసి తనను చంపుతానని బెదిరింపులకు గురిచేస్తున్నరని పోలీసు అధికారులు స్పందించి తనకు రక్షణ కల్పించాలని సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన కూనపరెడ్డి సంతోష్ విజ్ఞప్తి చేశారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో విలేకరుల ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో తాను గత కొన్ని సంవత్సరాలుగా శ్రీలక్ష్మీగణపతి ప్రయివేట్ జాబ్ కన్సల్టెన్సీ నడుపుతున్నట్లు తెలిపారు. దీని ద్వారా పట్టణంలోని బాలాజీనగర్కు చెందిన సాయిని శ్రీనివాసరావు అల్లుడు కి ఉద్యోగం ఇప్పించానని అదే నమ్మకంతో ఆయన కుమారుడికి కూడా ఉద్యోగం చూపాలంటూ 8 లక్షలు డబ్బు చెల్లించాడని అన్నారు. ఆయన చెల్లించిన డబ్బును తాను పలు కంపెనీలకు అందించానని కరోణ విపత్కర పరిస్థితుల్లో కంపెనీల్లో ఉద్యోగాలు దొరకకపోగా తన డబ్బులు కూడా ఆగిపోయాయని అన్నారు. దీంతో శ్రీనివాసరావు తాను చెల్లించిన డబ్బులను ఇవ్వాలంటూ కోరగా తన శక్తి మేరకు రెండు లక్షల రూపాయల నగదు అందించానన్నారు. అయినప్పటికీ శ్రీనివాసరావు తీవ్ర ఒత్తిడి చేయడంతో గత్యంతరం లేక తనకున్న 350 గజాల ప్లాటు ఒరిజినల్ కాగితాలను ఇచ్చానని తెలిపారు. అయినప్పటికీ శ్రీనివాసరావు మొత్తం డబ్బులు చెల్లించాలని గత కొద్ది రోజులుగా ఓ ఇరువురు పెద్ద మనుషులతో కలిసి తనను వేధింపులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
పలు కంపెనీల్లో నా డబ్బులు ఆగిపోయినట్లు కోర్టు కూడా స్టే ఇవ్వడం జరిగిందన్నారు. అయినప్పటికీ వినిపించుకోకుండా నన్ను చంపుతానంటూ తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారని పోలీసు అధికారులు స్పందించి తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాల్సిందిగా వేడుకున్నారు. ఇదే విషయాన్ని జిల్లా ఎస్పీని కలసి విన్నవిద్దామన్న కలవనియకుండా ఈ పెద్దమనుషులు మేనేజ్ చేసున్నారని ఆరోపించారు. జిల్లా ఎస్పీ గారు స్పందించి తగిన విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు