Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

దడపుట్టిస్తున్న థర్డ్‌వేవ్‌ హెచ్చరికలు ! 

భారతదేశంలో ఓమిక్రాన్‌ ప్రభావం రోజు రోజుకు తీవ్రమవుతోంది. కరోనా ఇన్ఫెక్షన్‌ కేసులు మళ్లీ పెరగడం ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ  సహా అన్ని రాష్టాల్ల్రో కరోనా వేగంగా విస్తరిస్తోంది. అయితే, కరోనా వైరస్‌ సామాన్యులతో పాటు కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్యులకు కూడా కరోనా సోకుతోంది. గతంలో డెల్టా సమయంలోనూ ఇదే జరిగింది. దీంతో ఇప్పుడు వైద్యులు, నర్సుల్లో మళ్లీ ఆందోళన మొదల య్యింది.

కరోనా వారియర్స్‌కు వైరస్‌ సోకితే చికిత్సలు చేయడం కూడా కష్టంగా మారవచ్చు. ఇదే సందర్భం లో ఒమిక్రాన్‌ విజృంభిస్తున్న తీరు ఆందోళనకరంగా తయారయ్యింది. అమెరికా మరోమారు కరోనా కేసుల తో అతలాకుతలం అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ఆంక్షలు అమల్లోకి వస్తున్న వేళ భారత్‌లో కూడా అనేక రాష్టాల్రు ఆంక్షలకు దిగుతున్నాయి. గోటితో పోయేదానికి గొడ్డలిదాకా తెచ్చుకున్న సామెతలా ప్రజలు మాస్కులు లేకుండా..భౌతిక దూరం పాటించకుండా విచ్చలవిడిగా తిరగడంతో ఇప్పుడు కరోనా మల్లీ అందరినీ వెన్నాడుతోంది. ఇప్పటికే అనేకమంది రాజకీయనాయకులు కరోనా బారిన పడ్డారు. అయినా ఎన్నికల ప్రచారం ఆగడం లేదు.

ప్రధాని మోడీ మొదలు అంతా ఎన్నికల ప్రచారంలొ తిరుగుతున్నారు. ఎన్నికలు ఆలస్యం కావడం వల్ల వచ్చే ప్రమాదమేవిూ లేదు. ఢల్లీి సిఎం కేజ్రీవాల్‌ మొదలు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపిలు, మహారాష్ట్రలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, తెలంగాణలో పలువురు ఎంపిలు, ఎమ్మెల్యేలు ఇలా రాజకీయ నాయకులు కరోనాబారిన పడ్డారు. ఇదంతా ఒక ఎత్తయితే మనలను కాపాడ డానికి ముందువరసలో ఉన్న వైద్యులు కూడా మళ్లీ కరోనాబారిన పడుతున్న తీరు ఆందోళన కలిగి స్తోంది.

ఢిల్లీ లో ఇప్పటివరకు 50 మందికి పైగా వైద్యులు కరోనా బారిన పడ్డారని సమాచారం. వీరంతా వివిధ ఆస్పత్రుల్లో పనిచేస్తున్నారు. ఢల్లీితో పాటు దేశ వ్యాప్తంగా కూడా వైద్యులు కరోనా బారిన పడుతు న్నారు. బీహార్‌లోని నలంద మెడికల్‌ కాలేజీ హాస్పిటల్లో ఇప్పటివరకు మొత్తం 153 మంది వైద్యులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. పాట్నాలోని ఎయిమ్స్‌లో నలుగురు వైద్యులు కరోనా బారిన పడ్డారు. కరోనా సోకిన వారిలో అధిక సంఖ్యలో రెసిడెంట్‌ వైద్యులు ఉంటున్నారు. ఈ పరిస్థితులు వైద్యులలో కలవరాన్ని పెంచు తున్నది. పెద్ద ఎత్తున వైద్యులు కరోనా బారిన పడుతుండటంతో.. వైద్య సేవలపై పెనుప్రభావం పడుతుం దని ఆందోళనలు రేకెత్తుతున్నాయి.

దేశంలో సెకండ్‌ వేవ్‌ సమయంలో చాలా మంది వైద్యులు కరోనా బారిన పడ్డారు. ఆ సమయంలో వైద్యులను 14 రోజుల క్వారంటైన్‌లో ఉంచాల్సి వచ్చింది. దాంతో చాలా మంది రోగులకు వైద్యం అందని పరిస్థితి ఏర్పడిరది. అంతేకాదు.. ఐఎంఏ ప్రకారం.. కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో దేశ వ్యాప్తంగా 500 మందికి పైగా వైద్యులు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అయితే, తాజాగా ఇప్పటి వరకు దేశంలో 1,800 మందికి పైగా బాధితులు ఓమిక్రాన్‌ బారిన పడ్డారు. వీరి సంఖ్యంగా క్రమంగా పెరుగుతున్నప్పటికీ.. రికవరీల సంఖ్య కూడా పెరుగుతోంది. 766 మంది ఒమిక్రాన్‌ బాధితులు ఇప్పటికే కోలుకున్నారు.

ఒమిక్రాన్‌ సోకిన వారిలో తేలికపాటి లక్షణాలే ఉండటం కాస్త ఉపశమనం కలిగి స్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రానున్న రోజుల్లో వైద్యులకు కరోనా సోకితే ప్రభుత్వం ఏ వ్యూహంతో ముందుకు వెళ్తుందో చూడాలి. కరోనా బారిన పడిన చాలా మందిలో తేలికపాటి లక్షణాలే కనిపిస్తున్నా యని తెలిపారు. బాధిత వైద్యుల నుంచి సేకరించిన నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపినట్లు తెలిపారు. కోవిడ్‌ ప్రోటోకాల్‌ ప్రకారం.. బాధిత వైద్యులంతా ఐసోలేషన్‌కు పంపుతున్నట్లు తెలిపారు. చాలా మంది వైద్యులు ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. క్వారంటైన్‌ నిబంధనలను రాబోయే రోజుల్లో సవిూక్షించ నున్నట్లు తెలిపారు.

వైద్యులు కరోనా బారిన పడుతుండటంతో సామాన్యులకు వైద్యంపై ఆందోళన కలిగి స్తోంది. ఆసుపత్రుల్లో రోగులు పెరగకపోతే ఆందోళన చెందాల్సిన పని లేదు. కానీ కరోనా తీవ్రరూపం దాల్చి పరిస్థితి విషమిస్తే ఏమిటన్నది ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇప్పటికే కార్యా చరణకు దిగాల్సి ఉంది. అయితే ఒమిక్రాన్‌ కేసులు వేగంగా పెరుగుతున్నప్పటికీ, ఆస్పత్రుల్లో చేరే రోగుల సంఖ్య చాలా తక్కువగానే ఉంటోంది. కరోనా సోకిన వారి సంఖ్య తక్కువగా ఉంటే.. చికిత్స విషయంలో పెద్దగా సమస్య ఉండదు. కానీ కేసులు పెరిగితే..వైద్యులకు కూడా కరోనా సోకితే ఎలా అన్న ఆలోచన చేయాలి. మరోవైపు ఒమిక్రాన్‌ సోకిన వారిలో తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉంటున్నాయి. అయితే వైద్యులు ఎక్కువ సంఖ్యలో కరోనా బారిన పడుతుండటంతో ఆస్పత్రుల్లో వైద్యుల కొరత ఏర్పడే అవకాశం ఉంది.

సెకండ్‌ వేవ్‌లో డెల్టా లక్షణాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. వైద్యులు 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ఇకపోతే ఒమిక్రాన్‌ లక్షణాలు తక్కువగా ఉండటంతో బాధితులు ఇంట్లోనే చికిత్స పొందవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఇప్పుడు వైద్యులకు కరోనా పాజిటివ్‌ తేలు తుండటం అందరినీ కలవరానికి గురిచేస్తోంది. ఒకవేళ వైద్యులు భారీ సంఖ్యలో కరోనా బారిన పడినట్ల యితే.. పరిస్థితి ఏంటా అని తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఎవరైనా వైద్యులలో కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.

వ్యాక్సీన్‌ రెండు డోసులు తీసుకున్నాక కూడా కరోనా సోకుతున్నది. ఇకపోతే ప్రధానంగా దేశ రాజధాని ఢల్లీిలో కరోనా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. కరోనా సోకిన వారిలో 81 శాతం మందిలో ఓమిక్రాన్‌ వేరియంట్‌ నిర్దారణ అయ్యింది. ఢల్లీిలో ఈ వేరియంట్‌ కేసులే భారీగా పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. వేగంగా పెరుగుతున్న కేసులతో.. యాక్టీవ్‌ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. పాజిటివిటీ రేటు కూడా 6 శాతానికి మించిపోయింది. ఢల్లీితో పాటు మహారాష్ట్రలోనూ కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రల్లో కూడా ఓమిక్రాన్‌ కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. హర్యానా, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌, కేరళ, తెలంగాణ, ఆంధప్రదేశ్‌ సహా అనేక ఇతర రాష్టాల్లో కూడా కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా థర్డ్‌వేవ్‌ మొదలైందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.