సర్కార్ బడుల్లో ఇంగ్లిష్ విూడియం చదువులు

ఆంగ్ల మాధ్యమంపై సానుకూల స్పందన
సర్కార్ బడులకు జవసత్వాలు
ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం పాఠశాలలను ప్రవేశపెట్టడంతోపాటు ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేస్తోంది. దీంతో భవిష్యత్తులో సర్కారు బడులకు డిమాండ్ పెరగనుంది. ఇంగ్లిష్ విూడియం బడులకు అవసరమైన బోధకులను తయారు చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ బడుల్లో 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ విూడియం పటిష్టం చేయనుంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడంతోపాటు పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుంది. అలాగే ప్రైవేట్ స్కూళ్ల పెత్తనం తగ్గగలదని పలువురు విద్యావేత్తలు అంటున్నారు. తెలుగును పటిష్టం చేయడంతో పాటు ఆంగ్లానిక ప్రాధాన్యం ఇస్తేనే తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కార్ స్కూళ్లకు పంపిస్తారని అంటున్నారు. సర్కార్ బడుల్లో ఇంగ్లిష్ విూడియం చదువులను ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్దంగా కార్యాచరణ చేసింది. ఇంతకాలం ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం లేకపోవడంతో వారి తల్లిదండ్రులు ప్రైవేట్ వైపే మొగ్గు చూపుతు న్నారు. సర్కారు బడుల్లో రోజురోజుకు విద్యార్థుల సంఖ్య తగ్గడం, కొన్ని పాఠశాలలు మూతపడుతున్నాయి. దీంతో సర్కార్ బడులను కాపాడుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు ఇంగ్లిష్ విూడియం పాఠశాలల్లో డీఎడ్ విద్యార్హత లేని వారితోనే విద్యాబోధన సాగుతోంది. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన ప్రారంభించినా తెలుగు విూడియం ఉపాధ్యాయులతోనే పాఠాలు బోధిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ఆంగ్ల బోధనకు ప్రభుత్వం ముందుకు సాగుతోంది.