Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వ్యాక్సిన్‌….ముందు జాగ్రత్తలే మందు !

చిన్నపిల్లలకు కూడా కరోనా టీకా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వారికి కూడా వ్యాక్సిన్‌ ఇచ్చే అవకాశం ఏర్పడిరది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు వ్యాక్సిన్‌ వేయించే బాధ్యత తీసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి. అప్పుడే కొంతయినా రక్షణ కలుగుతుంది. శీతల వాతావరణంలోనే కరోనా  బతుకుతుందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. ఈ శీతాకాలం ప్రవేశంతోనే ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ విజృంభిస్తోంది. అందువల్ల చలికాలం ముగిసే వారకు దీని పెరుగుదల ఉండవచ్చని అంటు న్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే.

ఇకపోతే వేడిపదార్థాలను తినడం అలవాటు చేసు కోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అందువల్ల ఐస్‌క్రీమ్స్‌, కూల్‌డ్రిరక్స్‌కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇకపోతే కరోనా వైరస్‌ నుంచి రక్షించుకునేందుకు యునిసెఫ్‌ కొన్ని సూచనలు చేసింది. వైరస్‌ ఎక్కడ, ఎంత సేపు బతుకుతుందో తెలయిచేసింది. అది సోకకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త లను వివరించింది.

కరోనా గాలి నుంచి సోకదని, వస్తువులపై మాత్రమే ఉంటుందని తెలిపింది. వైరస్‌ అంటిన వస్తువులను ముట్టుకుని నోరు లేదా ముక్కు దగ్గర చెయ్యి పెడితేనే వైరస్‌ అంటుతుంది. వస్తువుల విూద ఉన్న వైరస్‌ బతికేది కేవలం 12 గంటలే. నీళ్లు, సబ్బుతో కడిగితే వైరస్‌ పోతుంది. బట్టలపై 9 గంటల పాటు వైరస్‌ బతుకుతుంది. రెండు గంటలు ఎండలో ఆ బట్టలను పెడితే వైరస్‌ చచ్చిపోతుంది. 6 నుంచి 27 డిగ్రీల టెంపరేచర్‌ వద్ద వైరస్‌ బతకదు. కాబట్టి మన దగ్గర దాని మనుగడ అంతంత అయినా జాగ్రత్తలు తీసుకుని ముందుకు సాగాలి. వేడి నీళ్లు తాగడం, ఎండకు ఉండడం ద్వారా వైరస్‌ను చంపేయొచ్చు. ఐస్‌ క్రీమ్‌, కూల్‌డ్రి౦కుల వంటి వాటిని తీసుకోకపోవడం మంచిది.

వైరస్‌లోని కణం సైజు 400 నుంచి 500 మైక్రాన్లు ఉంటుంది. చేతులపై వైరస్‌ ఉండేది కేవలం 10 నిమిషాలే. శానిటైజర్లతో కడిగితే వైరస్‌ను చంపే యొచ్చు. వేడి ఉప్పు నీటితో గార్లింగ్‌ చేస్తే ట్రాన్సిల్స్‌కు కారణమయ్యే క్రిములను చంపేయొచ్చు.  విద్యా సంస్థలు నడుస్తున్నందున విద్యార్థుల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు కరోనా రాకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై అవగాహన కల్పించడంతో పాటు జర్వం, జలుబు లాంటి ఉంటే వారికి వెంటనే పరీక్షలు నిర్వహించాలని నిపునులు సూచిస్తున్నారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ కోసం విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని తెలసారు. తరచూ చేతులు కడుక్కోవాలి. తుమ్ములు, దగ్గు వచ్చేటప్పుడు కర్చీఫ్‌ లేదా టీష్యూ అడ్డుపెట్టుకోవాలి. దీని ద్వారా కరోనా వైరస్‌తో పాటు ఇన్‌ఫ్లూయెంజా లాంటి పలు అంటువ్యాధులను నివారించవచ్చని నిపుణుల బృందం తెలిపింది.

విద్యార్థులు, యువతకు ఈ సమాచారం తెలియజేయడం ద్వారా మరింత మందికి అవగాహన కల్పించ వచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థులకు సరైన అవగాహన కల్పించా లని కోరింది. ఒమిక్రాన్‌.. చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వేరియంట్‌. అయితే సింప్టమ్స్‌ తక్కువ గా ఉంటున్నాయి. ఆస్పత్రికి వెళ్లే అవసరం తక్కువగా ఉంటోంది. దీంతో ఒమిక్రాన్‌ అనేది ’నేచురల్‌ వ్యాక్సిన్‌’ లాంటిదని ప్రపంచవ్యాప్తంగా కొందరు సైంటిస్టులు అంటున్నారు.

కరోనా ’ఎండెమిక్‌’ స్థాయికి చేరేందుకు కొత్త వేరియంట్‌ సాయపడొచ్చని చెబుతున్నారు. ఒమిక్రాన్‌.. సహజ వ్యాక్సిన్‌ అనేది చాలా ప్రమాదకర ఐడియా. బాధ్యతలేని వ్యక్తులే ఇలాంటివి స్పెడ్ర్‌ చేస్తున్నారు. ’లాంగ్‌ కొవిడ్‌’ పర్యవసానాలు ఎలా ఉంటాయో ఎవరికీ స్పష్టంగా తెలియదని ఇండియన్‌ సార్స్‌ కోవ్‌2 జీనోమిక్స్‌ కన్సార్షయా ఇన్సాకాగ్‌ అడ్వైజరీ గ్రూప్‌ సభ్యులు అన్నారు.  మైల్డ్‌ ఒమిక్రాన్‌ అనేది వ్యాక్సిన్‌ కాదు. ఈ వేరియంట్‌ వల్ల కూడా ఆస్పత్రుల్లో చేరుతున్నారు, చనిపోతున్నారు.

వ్యాక్సిన్‌తో పోల్చుకుంటే.. సహజ ఇన్ఫెక్షన్‌ అనేది ఏ వేరియంట్‌ నుంచి కాపాడలేదని చెప్పారు.కరోనా వల్ల దీర్ఘకాలంలో ప్రభావాలు ఉండొచ్చని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఉజాల సిగ్నస్‌ గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ ఫౌండర్‌ శుచిన్‌ బజాజ్‌ సూచించారు. మైల్డ్‌ సింప్టమ్స్‌ తర్వాత.. కీలక అవయవాల్లో 6 నెలలకంటే ఎక్కువ కాలం వైరస్‌ ఉంటుందని తేలింది.

పోస్ట్‌ కొవిడ్‌ సమస్యలతో బాధపడుతున్న వాళ్లను, లాంగ్‌ కొవిడ్‌ పేషెంట్లను చూస్తున్నాం. ఒమిక్రాన్‌ వల్ల ఐసీయూల్లో చేరుతున్న వాళ్లూ ఉన్నారు. దాన్ని సహజ వ్యాక్సిన్‌లా భావించొద్దని అన్నారు.  మరోవైపు దేశంలో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్న తీరు ఆందోలనకు కారణం అవుతోంది.

కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే అనేక రాష్టాల్ల్రో నైట్‌ కర్ఫ్యూలు, అమలు చేస్తున్నారు.  పాజిటివిటి రేటు పెరుగుతుండటంతో ఢిల్లీ , హర్యానా, పశ్చిమ బెంగాల్‌ రాష్టాల్లో విద్యాసంస్థలను మూసివేశారు.  సినిమా హాళ్లు బంద్‌ చేశారు.  ఇక 50 శాతం సీటింగ్‌లో రెస్టారెంట్లు, మెట్రోలు నడుస్తున్నాయి.  కార్యాలయాలు సైతం 50 శాతం మంది ఉద్యోగులతోనే నడుస్తున్నాయి.  మిగతా రాష్టాల్ర కంటే ఢిల్లీ లో వేగంగా కేసులు పెరుగుతుండటంతో కేజీవ్రాల్‌ సర్కార్‌ ఆంక్షలను కఠినం చేసేందుకు సిద్ధమయింది.  పాజిటివిటి రేటు 0.5 శాతం దాటితే ఎల్లో అలర్ట్‌ ను ప్రకటించి నైట్‌ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు.  అయితే, ఇప్పుడు ఢిల్లీ లో పాజిటివిటీ రేటు 4.59 శాతానికి పెరిగింది.  ఇదే ఇప్పుడు అందర్ని భయపెడుతున్నది.  పాజిటివిటీ రేటు 5 శాతానికి చేరుకుంటే రెడ్‌ అలర్ట్‌ ను ప్రకటించాల్సి ఉంటుంది.  రెడ్‌ అలర్ట్‌ను ప్రకటించడం అంటే పూర్తి స్థాయిలో కర్ఫ్యూను అమలు చేయాలి.

వీకెండ్స్‌లో జనసంచారాన్ని పూర్తిగా నిషేధించాల్సి రావొచ్చు.  వీక్‌ డేస్‌లో కొన్నింటికి మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంటుంది.  నిత్యావసర వస్తువుల దుకాణాలు మినహా మిగతా షాపులు, మాల్స్‌ను బంధ్‌ చేయాల్ని ఉంటుంది.  బార్లు, రెస్టారెంట్లను పూర్తిగా క్లోజ్‌ చేయవచ్చు. అయితే, హోటల్స్‌కు పర్మిషన్‌ ఇచ్చే అవకాశం లేకపోలేదు.  అదీ పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతి ఇవ్వొచ్చు.

ఢిల్లీ లో ఇప్పటికే సినిమా హాల్స్‌, స్పా, యోగా సెంటర్స్‌ను మూసేశారు.  జీఆర్‌ఎపీ నిబంధనల ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూసేయాల్సి ఉంటుంది.  అత్యవసర కార్యాలయాలు మినహా యింపులు ఉండొచ్చు.  అటు ప్రైవేట్‌ కార్యాలయాలకు కూడా ఇది వర్తిస్తుంది. ఎల్లో అలర్ట్‌ అమలులో ఉండటం వలన పెళ్లిళ్లు, అంత్యక్రియలకు 20 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. రెడ్‌ అలర్ట్‌ అమలు లోకి వస్తే ఆ సంఖ్య 15 కి కుదించే అవకాశం ఉంటుంది.  ప్రజలు వ్యాధి వ్యాప్తికి కారణం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. అప్పుడే కరోనాను కట్టడి చేయగలమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.