రమేష్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన సమ్మయ్య

జన్మదినం సందర్భంగా మొక్కలు నాటిన రమేష్

నెక్కొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ భవన్ ఆవరణలో ఈదునూరి రమేష్ జన్మదిన సందర్భంగా వనప్రేమికుడు, గ్రీన్ ఛాలెంజ్ అవార్డు గ్రహీత నల్లగొండ సమ్మయ్య ఆధ్వర్యంలో గంగరావి మొక్క నాటడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెక్కొండ పిఏసిఎస్ చైర్మన్ మారం రాము , తెరాస సీనియర్ నాయకులు తాటిపల్లి శివకుమార్ విచ్చేసి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఈరోజు ఈదునూరి రమేష్ జన్మదిన సందర్భంగా వనప్రేమికుడు నల్లగొండ సమ్మయ్య అందించిన గంగరావి మొక్కను నాటించడం మంచి విషయం. పర్యావరణ పరిరక్షణ కోసం భవిష్యత్ తరాలకు ఆహ్లాదకరమైన ఆక్సిజన్ అందించి ఆరోగ్యంగా జీవించే విదంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం గొప్ప పని, ఈ సందర్భంగా ప్రతిఒక్కరు మొక్కలు నాటి పర్యావరణన్నీ పరిరక్షించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్ హెచ్ డి రాష్ట్ర కొర్ కమిటీ సభ్యులు ఈదునూరి యకయ్య , అంబెడ్కర్ యువజన సంఘం జిల్లా కార్యదర్శి ఈదునూరి వెంకటేశ్వర్లు , మాజీ అధ్యక్షులు బిర్రు సుదర్శన్ , అంబెడ్కర్ సంఘం నాయకులు చిన్నపల్లి రాంచందర్ , కందిక మాణిక్యం మనుబోతుల మల్లయ్య , గారే శ్యామ్ , కందిక వీరస్వామి, ఈదునూరి క్రాంతి తదితరులు పాల్గొన్నారు.