డిసెంబర్ 26న వివాహం…1 న మృతి
చింతపల్లి మండలం మాల్ వద్ద దేవరకొండ డిపో ఆర్టీసి బస్సు, ఆటో ఢీ.
ఆటోలో ప్రయాణించిన తండ్రీకొడుకులు ఇద్దరు అక్కడికక్కడే మృతి.
కాళ్ళపారాణి ఆరకముందే ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు.
వికారాబాద్ వన్ టౌన్ ఎస్ఐ శ్రీను నాయక్(32) ఆయన తండ్రి మాన్య నాయక్(50) అక్కడిక్కడే మృతి.
మృతులు రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం మాన్య తండా వాసులుగా గుర్తింపు.
శ్రీను నాయక్ వారం క్రితమే వికారాబాద్ వన్ టౌన్ ఎస్ఐ గా బాధ్యతలు.
డిసెంబర్ 26న శ్రీనుకు వివాహం, వడిబియ్యం కార్యక్రమం ముగించుకుని స్వగ్రామానికి వెళ్తుండగా ఘటన.
తండ్రి మాన్య ఆటో డ్రైవర్, ఇటీవల తండ్రి చేతికి గాయం కావడంతో స్వయంగా ఆటో నడిపిన ఎస్ఐ శ్రీను నాయక్.