వైష్ణో దేవి మందిరంలో తొక్కిసలాట…12 మంది దుర్మరణం
జమ్మూలోని వైష్ణో దేవి మందిరంలో తొక్కిసలాట
శనివారం తెల్లవారు జామున జమ్మూలోని మాతా వైష్ణో దేవి మందిరంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది మరణించారు మరియు 15 మంది గాయపడ్డారు.
తెల్లవారుజామునే భక్తుల రద్దీతో తొక్కిసలాట జరగడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ ఈ ప్రమాదానికి దారితీసిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.