రోహిత్ గైర్హాజరీలో కెప్టెన్‌గా కెఎల్ రాహుల్
సౌత్ ఆఫ్రికా తో జనవరి 19 నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ కోసం 18 మంది సభ్యులతో కూడిన జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) శుక్రవారం ప్రకటించింది.
BCCI సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ జట్టును ప్రకటించడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రోహిత్ పూర్తి ఫిట్‌నెస్ తిరిగి పొందక పోవడం తో KL రాహుల్‌ను స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా నియమించారని తెలియజేశాడు.
“రోహిత్ శర్మ ఫిట్‌గా లేక పోవడం తో అతను ODIలకు వెళ్లడం లేదని , అతను తన ఫిట్‌నెస్‌పై పని చేస్తున్నాడని తెలిపారు .జస్ప్రీత్ బుమ్రా తొలిసారిగా జట్టుకు వైస్ కెప్టెన్‌గా నియమించారు .
దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు లో మహ్మద్ షమీ రెడ్ హాట్ ఫామ్ ఉన్నప్పటికీ, ODIలకు విశ్రాంతి ఇచ్చారు. హార్దిక్, కృనాల్ పాండ్యాలు తప్పుకున్నప్పటికీ శిఖర్ ధావన్ వన్డే జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
రవీంద్ర జడేజా మరియు అక్షర్ పటేల్ లు గాయాల నుండి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. రితురాజ్ గైక్వాడ్, వెంకటేష్ అయ్యర్ వంటి కొత్త వాఋ IPL, హజారే ట్రోఫీ అద్భుతమైన ప్రదర్శనల నేపథ్యంలో అవకాశం ఇచ్చారు.
సౌత్ ఆఫ్రికా తో వన్ డే లకు భారత జట్టు: KL రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, వెంకటేష్ అయ్యర్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్ (జస్ప్రితమ్- కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్.