పల్లె ప్రగతితో గ్రామాలకు మహర్దశ

ఆదర్శంగా మారుతున్న పల్లెసీమలు
కెసిఆర్ లక్ష్యాల మేరకు అభివృద్ది
పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి వెల్లడి
గ్రామాల అభివృద్ది లక్ష్యంగా, స్వచ్ఛ గ్రామాలను తయారు చేసుకోవాలన్న సంకల్పంతో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం తెలంగాణలో మంచి ఫలితాలను సాధించిందని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రజలను గ్రామాల
అభివృద్దిలో భాగస్వాములను చేయడం, గ్రామాల పారిశుద్యానికి ప్రాధాన్యం ఇవ్వడమన్న సంకల్పంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నామన్నారు. ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచి ఎక్కడిక్కడ తమ గ్రామాలను స్వచ్చంగా ఉంచుకోవాలన్నారు. ప్రజలకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాలను పరిపుష్టం చేసే దిశగా అనేక కార్యక్రమాలు సాగుతున్న తీరు ఇరత రాష్టాల్రకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు. తెలంగాణలో మిషన్ కాకతీయ,మిషన్ భగీరత కార్యక్రమాలు విజయవంతం అయి వాటి ఫలాలను ప్రజలు అందుకుంటున్నారని అన్నారు. నిరంతర విద్యుత్ రావడంతో గ్రామాల్లో పరిస్థితి మారింది. వ్యవసాయానికి పెద్ద ఎత్తున కృషి జరుగుతోంది. అందుకే కంది,మిర్చి, పసుపు పంటల దిగుబడి పెరిగింది. వరి ధాన్యం దిగుబడులు పెరుగుతున్నాయని అన్నారు.
నిజానికి ప్రజల భాగస్వామ్యం లేకుండా చేసే ఏ కార్యక్రమం కూడా విజయం సాధించదు. ఇది గమనించిన సిఎం కెసిఆర్ వారిని భాగస్వాములను చేసే సంకల్పంతో దీనిని విజయవంతం చేశారు. గ్రామాలను మెరుగుపరచడానికి అంకితభావం, కట్టుబాటు, చిత్తశుద్ధితో ప్రయత్నాలు జరుగుతున్నట్లు వెల్లడిరచారు. గ్రామాలను అభివృద్ద ఇచేయడమే లక్ష్యంగా సిఎం కెసిఆర్ తీసుకున్న ఈ కార్యక్రమంతో గ్రామాల్లో గణనీయమైన మార్పులు వస్తున్నాయన్నారు. ఇటీవలి కాలంలో వివిధ సమస్యలను దృష్టిలో పెట్టుకుని చేసిన ఈ ప్రయత్నం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిమంత్రం కావాలి. ఇంత వరకు డంపింగ్ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణం ప్రారంభించని గ్రామాల్లో వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవడం చేయబోతున్నామని అన్నారు. అలాగే ప్రజలను భాగస్వామ్యం చేయడం ద్వారా అభివృద్దికి బాటలు వేస్తున్నామని అన్నారు. గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం ద్వారానే గ్రామస్వరాజ్యం సిద్దించ గలదు. గ్రామాలు బాగుపడితేనే దేశం ఆర్థికంగా పటిష్టం అవుతుంది. గ్రామాలు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటాయి. పల్లెలు పచ్చగా ఉంటేనే రోగాలు దరిచేరవు. ఈవిషయాన్ని గమనించిన సిఎం కెసిఆర్ పల్లెలను ప్రగతి బాటన పరుగులు పెట్టించే లక్ష్యంతో గ్రామప్రణాళికకు శ్రీకారం చుట్టారని ఎర్రబెల్లి అన్నారు. విద్యతో పాటు విజ్ఞానం కూడా అందరికీ చేరేలా చూడాలని కెసిఆర్ తెలిపారు. వ్యవసాయంతో సహా గ్రామాల వికాసానికి చర్యలు చేపట్టారు. బీళ్లు బారిన తెలంగాణ భూములను సస్యశ్యామలం చేయాలన్న సంకల్పంతో, గొంతెండుతున్న జనం కష్టాలను తీర్చాలన్న సంకల్పంతో ప్రారంభించిన పథకాలు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలని ఎర్రబెల్లి అన్నారు. సుదీర్ఘకాలం తరవాత గ్రావిూణాభివృద్ధి దిశగా కెసిఆర్ కీలక చర్యలు చేపడుతున్నారు. పల్లె ప్రజలను పట్టిపీడిస్తున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం పలు కార్యక్రమాలను ముందుకు తీసుకువస్తున్నామని మంత్రి వివరించారు.