Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

భయంభయంగానే కొత్త సంవత్సరంలోకి ..!

వరుసగా రెండోయేడూ ప్రపంచం అంతా కరోనా భయాలతో కొత్త సంవత్సరంలోకి అడుగిడి౦ది. భయాలు వెన్నాడుతున్నా ప్రజలు తమ ఉత్సాహాన్ని చంపుకోకుండా సంబరాలతో గడిపారు. గతంతో పోలిస్తే ఉత్సాహం తగ్గంది. వరుసగా రెండోయేడూ కూడడా ఉత్సాహం అంతగా కానరాలేదు. ఎక్కడ మనం దానికి బలవుతామో అన్న భయం కూడా వెన్నాడిరది. తగిన జాగ్రత్తలు తీసుకునే స్పృహ పెరిగింది. 2022లోనూ భయంభయంగానే మన అడుగులు పడ్డాయి. దీనితోడు ప్రపంచవ్యాప్తంగా కరోనాతో పాటు.. కొత్‌ వేరియంట్‌ ఒమిక్రాన్‌ విజృంభిస్తోంది. ఇది మన అలక్ష్యాన్ని సూచిస్తోంది.

జేబులో మాస్కు పెట్టుకుని మూతికి పెట్టుకుంటే అంతకు మించిన వ్యాక్సిన్‌ లేదని వైద్యనిపుణులు చేస్తున్న హెచ్చరికలు మనకు శిరోధార్యం కావాలి. కరోనా ప్రభావం ఎంతకాలం ఉంటుందన్న దానికి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం.  ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తి మళ్లీ పెరగడం ఆందోళన కలిగింస్తోంది. ఒమైక్రాన్‌ కొత్త వేరియంట్‌ విజృంభణతో మళ్లీ ఆంక్షల దిశగా అనేక దేశాలు పయనిస్తున్నాయి. ప్రపంచ దేశాల మధ్య రాకపోకలు ఇప్పటికే స్తంభించాయి. కొన్ని దేశాలు పట్టణాల మధ్యరాకపోకలను కూడా నిషేధించాయి. అంతర్గత విమాన సర్వీసులను రద్దు చేశాయి. అంతర్జా తీయ విమనాశ్రయాలన్నీ జనాలు లేక బోసిపోతు న్నాయి. మరోమారు ప్రపంచం స్తంభిస్తే ఉత్పత్తి పడిపోవ డం, వస్తు వినియోగం పెరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా భారత్‌ లాంటి దేశాలు అతలాకుతలం అవుతు న్నాయ. ఇక విదేశాల నుంచి వస్తున్న వారి కారణంగానే మనదేశంలో ఒమైక్రాన్‌ కేసుల సంఖ్య పెరుగు తోంది.

కరోనా తీవ్రత కారణంగా మార్కెట్ల పతనం కొనసాగుతోంది. అయినా డాలర్‌తో రూపాయి మారకం విలువ మాత్రం తగ్గడం లేదు. ఇది కూడా మన ఆర్థిక వ్యవస్థకు భారంగానే చూడాలి. ఈకొత్త సంవత్సరం లో భారతదేశం డెబ్బయ్‌ ఐదేళ్ళు పూర్తి చేసుకుని ఆజాదీకా అమృతోత్సవాలను జరుపు కుంటోంది. కరోనా తగ్గి ఈ ఏడైనా మంచిరోజులు వస్తాయని అందరూ ఆశించారు. అయితే అది ఇప్పట్లో అసాధ్యం అన్న రీతిలో పరిస్థితులు ఉన్నాయి.

అతివేగంగా విజృంభిస్తున్న ఒమైక్రాన్‌ మనలను కొంత కాలమైనా ప్రశాంతం గా ఉండనిచ్చేలా లేదు. ప్రమాద తీవ్రత తక్కువేనని అంటున్న విజృంభిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. 2021లో కూడా ఇలాగే భయాలు వెన్నాడాయి. మొన్నటి వరకు ఇవి మనతోనే ఉన్నాయి. ఇంతలోనే మళ్లీ ఒమిక్రాన్‌ వేరియంట్‌తో పాటు కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో ప్రభుత్వాలు మరింత అప్రమత్తం కావాల్సి ఉంది.

కొత్త ఏడాది ప్రజలకు మళ్లీ విషాదం నింపకుండా చూడాలి. అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలు కూడా అప్రమత్తం గా ఉండాల్సిన సంవత్సరమిది. గతేడాది చివర్లో కొంత ఉపశమనం కనిపించినా అలాంటిదేవిూ లేదన్న సందేశంతో మనమంతా కొత్త ఏడాదిలో మరింత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. ఇదే సందర్భంలో ప్రభుత్వాలు కూడా ప్రజలకు అండగా నిలవాలి.

గతేడాది ప్రభుత్వాలు మరణాల లెక్కలు చెప్పకుండా దాచినా, దహనవాటికల ముందు బారులు తీరిన అంబులెన్సులు, అంతిమయాత్ర వాహనాలు, ఆపద్ధర్మంగా బహిరంగప్రదేశాల్లో ఏర్పడిన కొత్త దహనవాటికలు ఆ మరణాల లెక్కలు చెప్పకనే చెప్పాయి. అలాగే ఎవరిని కదిలించినా తమ వాళ్లు ఎవరో ఒకరు పోయారన్న బాధలు వెళ్లగక్కారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రజలతో ఆడుకున్నాయి. అలాంటి ముప్పు రాకూడాదని మనమంతా కోరుకోవాలి. ఎందుకంటే  ప్రాణవాయువు లేక కళ్ళముందే ఆత్మీయులు కన్నుమూసిన భయానక, అమానవీయ సంఘటనలు చూశాం. అమితే రాజకీయ కార్యకలా పాలు మాత్రం యధావిధిగా సాగిస్తున్నారు.

ఎన్నికలకూ కరోనా అడ్డంకేవిూ కాదని నిరూపించారు. గత ఏడాది మాదిరిగానే, ఈ యేడు కూడా ఎన్నికల ప్రచారాలు యధావిధిగా సాగిస్తున్నారు.  ప్రజలు ఎంతటి దయనీయస్థితిలో ఉన్నప్పటికీ ఎన్నికలను మాత్రం ఆపడం లేదు. అధికారంలో ఉన్నవారికి ఎన్నికలే అత్యంత ముఖ్యమైనవని ఎప్పుడూ నిరూపిస్తూనే ఉన్నారు.

కరోనా గడ్డుకాలంతో గతేడాది వ్యాపార, వాణిజ్యాలు తీవ్రంగాదెబ్బతింటున్నాయి. చిరు వ్యాపారులు ఆదాయం లేక చితికి పోయారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం ఇష్టం లేక ..గత్యంతరం లేక యధావిధిగా తమ జీవనాధారం కోసం పనుల్లో దిగక తప్పలేదు. వరుసగా పెరుగుఉతున్న ధరలతో రానున్న రోజుల్లో పెట్రోల్‌,డీజిల్‌ ధరలు  అందుబాటులో ఉంటాయా లేదా అన్న భయాందోళనలో ప్రజలు ఉన్నారు.ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు స్వారీ చేస్తున్నాయి.

కరోనా కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యం లోకి ప్రవేశించింది. కరోనా ప్రతాపంతో ప్రపంచ వృద్ధి రేటు దారుణంగా పడిపోవచ్చన్న భయాలతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు పోటీపడుతున్నారు. కరోనాతో ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగరేటు పెరిగిపోతుంది. కరోనా నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తుండడం ఆర్థిక సంక్షోభానికి దారితీసే ప్రమాదం లేకపోలేదు.

కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ కరోనా వ్యవహారం ఎంతవరకు దారితీస్తుందన్న దానికి సమాధానం లేదు. దీంతో నిత్యావసర సరుకులు, రవాణకు మరింత గడ్డుకాలం రావచ్చన్న భయాలు మనలను వెన్నాడుతున్నాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో కోవిడ్‌ కొత్తరకం ’ఒమిక్రాన్‌’ ప్రపంచ దేశాలను ఠారెత్తిస్తోంది. అసాధారణ మ్యుటేషన్ల కలయికగా ఒమిక్రాన్‌ను వైద్య పరిశోధకులు పేర్కొన్నారు.

సెకండ్‌ వేవ్‌ సృష్టించిన విపత్తును తలచుకుంటేనే జనం వణికి పోతున్నారు. ఆక్సిజన్‌ లేమి, వైద్య సదుపాయాల కొరత, అరకొర టీకాలు ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా చేశాయి. ప్రతి రోజూ లక్షల్లో పాజిటివ్‌ కేసులు, వేలల్లో మరణాలు జనాన్ని వణికించాయి. తాజా వేరియంట్‌ అంత ప్రమాదకారి కాదని ఒకవైపు..జాగ్రత్తగా ఉండాలని మరోవైపు వస్తున్న హెచ్చరికల మధ్య ప్రజల కొత్త సంవత్సర ఆశలను ఆవిరి చేసేలా ఉంది. 2022 కూడా పీడకలగా మారకుండా చూడాలని కోరుకుందాం. ఛాలెంజ్‌గా ముందుకు సాగితేనే విజయం సాధిస్తాం.