అన్నం సేవా ఫౌండేషన్ దారుణాలపై విచారణ చెయ్యాలి

అన్నం సేవా ఫౌండేషన్ లో దారుణాలు
-సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
-ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ చైర్మన్ , రాష్ట్ర అధ్యక్షులు తమ్మిశెట్టి చక్రవర్తి
స్థానిక ప్రెస్ క్లబ్ విలేకర్ల సమావేశంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన అన్నం సేవా ఫౌండేషన్ లో మానవహక్కుల ఉల్లంఘన వంటి దారుణాలు జరుగుతున్నాయని , అసలు అన్నం సేవా ఫౌండేషన్ లో ఏం జరుగుతుంది ? వచ్చిన నిధులు ఏమవుతున్నాయి ? డాక్టర్ అన్నం శ్రీనివాసరావు అరాచకాలను , దారుణాలను ఆపేదెవరు ? లైగింక వేధింపులకు , హింసలకు గురి చేస్తున్నారని తమ దృష్టికి వచ్చాయని ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ చైర్మన్ , రాష్ట్ర అధ్యక్షులు తమ్మిశెట్టి చక్రవర్తి పేర్కొన్నారు . వెంటనే అన్నం సేవా ఫౌండేషన్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు . అన్నం సేవా ఫౌండేషన్లో పనిచేస్తున్న ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన ముద్దెల రవీందర్ అనే వ్యక్తిని దారుణంగా కాళ్లు చేతులు కులం పేరుతో దుర్భాశలాడుతూ కట్టి కర్రలతో , రాడ్లతో దాడి చేశారని ఆరోపించారు . ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని కుటుంబసభ్యులను బెదిరించారని పేర్కొన్నారు . స్థానిక ప్రశాంతి హాస్పటల్లో చికిత్స చేయించారని దానికి అయ్యే ఖర్చును వలనే కట్టమని ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలిపారు . అన్నం శ్రీనివాస్ తో పాటు కొంతమంది ఇంటికొచ్చి దాడి చేసి టీవీని , సెల్ఫోను తీసుకెళ్లారు అని అనంతరం ఈనెలలో పోటీసుల అండదండలతో 3రోజులుగా 2టౌన్ నందు ఎఫైఆర్ గానీ కనీసం కంప్లైంట్ లేకుండా భయపెట్టారని ఆరోపించారు . ఈ విషయాల మీద సీపీని , కలెక్టర్ ను కలిసి విచారణ జరిపించాలని వినతిపత్రాన్ని సమర్పించారు. ఇలాంటి మరెన్నో దారుణాలు అన్నం సేవా ఫౌండేషన్ లో జరుగుతున్నాయని , వచ్చిన డొనేషన్లకు సంబంధించిన సరైన విధంగా లెక్క పత్రాలు లేవని , వీటిపై ఐటీ రిటన్స్ లేదని కాబట్టి ఫౌండేషన్ని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు . మతిస్థిమితం కోల్పోయిన వారిపై మానవ హక్కుల ఉల్లంఘనగా చేయడం అమానుషమని అన్నారు . దీనిపై NHRC , NCSC ని కూడా కలిసి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో బాధితుడి తల్లి విజయ , కుటుంబ సభ్యులు రమ్య పాల్గొన్నారు .