దక్షిణ కాశ్మీర్‌లో 6 గురు జెఎమ్ ఉగ్రవాదులు హత౦
దక్షిణ కాశ్మీర్‌లో 6 మంది జెఎమ్ ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు తెలిపారు ఒక పోలీసు గాయపడగా అతన్ని అనంతనాగ్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ మరియు కుల్గాం జిల్లాల్లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో ఇద్దరు పాకిస్థానీలతో సహా నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహ్మద్ (జెఇఎం)కి చెందిన ఆరుగురు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు గురువారం ఉదయం తెలిపారు.
కుల్గాం జిల్లాలోని మిర్హామా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఆ ప్రాంతంలో బలగాలు సోదాలు నిర్వహిస్తుండగా, దాక్కున్న ఉగ్రవాదులు తమపై కాల్పులు జరిపారని వారు తెలిపారు.