కెసిఆర్‌ అసలైన రైతుబంధువు

చిత్రపటానికి రైతుల క్షీరాభిషేకం
నిర్మల్‌,డిసెంబర్‌29(ఆర్‌ఎన్‌ఎ): యాసంగి కాలానికి సంబంధించిన రైతుబంధు ఖతాల్లో జమ కావడంతో అన్నదాతలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైతుబంధు ద్వారా పంట పెట్టుబడి జమ చేసినందుకు ముధోల్‌ నియోజకవర్గం లోకేశ్వరం మండలం పుస్పూర్ర్‌ గ్రామంలో రైతులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.అనంతరం మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడారు. అసలైన రైతు బంధువు తెలంగాణ సీఎం కేసీఆర్‌ అని ఆయన కొనియాడారు.దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పంట పెట్టుబడి కింద ఎకరానికి ఏడాదికి పది వేల రూపాయలు అందిస్తున్న ఏకైక
ప్రభుత్వం తమదే అన్నారు.గత ప్రభుత్వాల హయాంలో ఎరువులు, విత్తనాల కొరత ఉండేదిని కొట్లాడి సాధించుకున్నతెలంగాణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిదులు, తదితరులు పాల్గొన్నారు.