గాదరి కిషోర్ కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండ జిల్లాలో పర్యటించారు. ఇటీవలే తండ్రిని కోల్పోయిన ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుటుంబాన్ని పరామర్శించారు. పీటీఆర్ కాలనీలోని కిషోర్ నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి ఎమ్మెల్యే తండ్రి మారయ్య చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్దాంజలి ఘటించారు. నివాళులు అర్పించిన వారిలో మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం సీఎం కేసీఆర్ హైదరాబాద్ కు తిరుగుపయనమయ్యారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్ తండ్రి మారయ్య ఇటీవలే గుండెపోటుతో మరణించారు.