తెలంగాణలో అలజడి రేపుతున్న ఒమిక్రాన్

తెలంగాణలో ఒమిక్రాన్ అలజడి రేపుతోంది.
కేసుల నమోదులో ఐదోస్థానంలో రాష్ట్రం
శంషాబాద్ బాలుడికి ఒమిక్రాన్ గుర్తింపు
సినీ హీరో మంచు మనోజ్‌కు కరోనా పాజిటివ్
నార్సింగ్ కాలేజీ విద్యార్థులకు కరోనాపై ఆందోళన
తెలంగాణలో ఒమిక్రాన్ అలజడి రేపుతోంది. దేశవ్యాప్తంగా మొత్తం 781 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా రికవరీ అయి డిశ్చార్జ్ అయిన వారు 241మంది వున్నారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో తెలంగాణ 5వ స్థానంలో వుంది. తెలంగాణలో ఇప్పటివరకూ 62 కేసులు నమోదయ్యాయి. రికవరీ అయినవారు 10 మంది. ఇదిలా వుంటే శంషాబాద్‌లో దిగిన ఓ బాలుడికి ఒమిక్రాన్ సోకింది. శంషాబాద్ లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. దుబాయ్ నుంచి వచ్చిన బాలుడికి ఒమిక్రాన్ సోకినట్లు నిర్దారణ అయింది.
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రానగర్‌లో పదిరోజుల కిందట దుబాయ్ నుంచి వచ్చిన ఓ బాలుడు(15)కి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సీకి పంపించారు. ఇందులో బుధవారం ఒమిక్రాన్‌గా నిర్దారణ అయ్యింది. ప్రైమరీ కాంటాక్టు ఉన్న 40 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ముగ్గురికి పాజిటీవ్ వచ్చింది. దీంతో బాధితులు హోం ఐసోలేషన్లోనే చికిత్స పొందుతున్నారు. అందులో ఒమిక్రాన్ ఉందని తేలడంతో అంతా అలర్ట్ అయ్యారు. అతడితో ప్రైమరీ కాంటాక్టు ఉన్న 40 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో బాలుడికి సన్నిహితంగా ఉన్న కుటుంబ సభ్యులు ముగ్గురికి కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో ఆ శాంపిల్స్‌ని జీనోమ్ సీక్వెన్సీకి పంపారు. వారందరికి కూడా ఒమిక్రాన్ ఉన్నట్లు తేలింది. దీంతో బాధితులందతా హోం ఐసోలేషన్లోనే చికిత్స పొందుతున్నారు.
కరోనా మహమ్మారి మళ్ళీ వేగంగా వ్యాపిస్తోంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు ప్రజలు. కరోనా తగ్గిపోయింది కదా అనే భ్రమలో ఉండకుండా మాస్క్, శానిటైజర్, సామజిక దూరం పాటించడం మంచిదని చెబుతున్నారు వైద్యులు. మరోమారు ప్రముఖ సినీ సెలెబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే కరీనా కపూర్, ప్రగ్యా జైస్వాల్ వంటి స్టార్స్‌కు కరోనా సోకగా తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.
మంచు హీరో కరోనా సోకినట్టు స్వయంగా వెల్లడి౦చారు. మంచు మనోజ్ తాజాగా సోషల్ విూడియాలో తనకు కోవిడ్ సోకినట్టు వెల్లడిరచాడు. ఇన్ట్సాగ్రామ్‌లో కోవిడ్ పాజిటివ్ అని తేలింది. గత వారంలో నన్ను కలిసిన ప్రతి ఒక్కరూ వెంటనే పరీక్షలు చేయించుకుని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. నా గురించి చింతించకండి. విూ అందరి ప్రేమ, ఆశీర్వాదాలతో నేను పూర్తిగా బాగున్నాను. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాను అంటూ పోస్ట్ చేశాడు.
ఇదిలావుంటే రంగారెడ్డి జిల్లాలో కరోనా వైరస్ కలకలం రేపింది. ఓ కాలేజీలో విద్యార్థులు వైరస్ బారిన పడ్డారు. 14 మందికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయ్యింది. నార్సింగిలోని ఓ కళాశాలలో 14 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఒక్కసారిగా తోటి విద్యార్థులంతా భయబ్రాంతులకు గురయ్యారు. గత రెండు రోజులుగా తీవ్ర చలి, జ్వరంతో విద్యార్థులు బాధపడుతున్నారు. దీంతో ఇవాళ ఉదయం విద్యార్దులకు కళాశాల యాజమాన్యం వైద్య పరీక్షలు చేయించారు. ఈ టెస్టుల్లో14 మంది విద్యార్దులకు కరోనా సోకినట్లు నిర్దారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన నార్సింగి మునిసిపల్ అధికారులు వెంటనే కాలేజీ వద్దకు చేరుకొని శానిటైజ్ చేశారు. మిగతా విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారిని కూడా క్వారంటైన్ లో ఉండాలని సూచించారు.