Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఆయిల్‌పామ్‌ సాగుతో లాభాలు అనేకం…కేంద్రమంత్రి తోమర్‌

ఆయిల్‌పామ్‌ సాగుతో లాభాలు అనేకం
ప్రపంచ వ్యాప్తంగా పంటకు డిమాండ్‌
హైటెక్స్‌ సదస్సులో కేంద్రమంత్రి తోమర్‌
ఆయిల్‌పామ్‌ సాగుతో మంచి లాభాలు ఉన్నాయని కేంద్ర వ్యవసాయశృాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. పంటలకు గిట్టుబాటు ధరలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా దీనికి డిమాండ్‌ ఉందన్నారు. పరిశ్రమ బలోపేతం, భవిష్యత్‌ కార్యాచరణపై హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జాతీయ సదస్సు జరుగుతోంది. సదస్సు సహా డ్రాగన్‌ ఫ్రూట్‌ ప్రదర్శన కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ప్రారంభించారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, కేరళ మంత్రి ప్రసాద్‌ పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరగనున్న జాతీయ సదస్సులో ఆయిల్‌పామ్‌ సాగు, భవిష్యత్‌ కార్యాచరణ రూపకల్పనపైన… జాతీయస్థాయి సంస్థలు, అధికారులు, నిపుణులు చర్చించనున్నారు. స్వయం సమృద్ధి లక్ష్యంగా రైతుల ఆదాయాలు రెట్టింపు, పర్యావరణహితం దృష్ట్యా పంట మార్పిడి విధానం, ముడి వంట నూనెల దిగుమతులు పూర్తిగా తగ్గించుకోవాలన్న లక్ష్యంతో కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో ఆయిల్‌పామ్‌ రైతుల సంక్షేమం, పరిశ్రమ బలోపేతంపై.. ప్రత్యేక దృష్టి సారించింది. నేషనల్‌ ఎడిబుల్‌ ఆయిల్‌ మిషన్‌ ` ఆయిల్‌పామ్‌ పథకం గురించి.. ఈశాన్య రాష్టాల్ల్రో విస్తృత ప్రచారం చేయడానికి ఉద్దేశించి… అక్టోబరు 5న గౌహతిలో బిజినెస్‌ సమ్మిట్‌ నిర్వహించింది. హైదరాబాద్‌ వేదికగా ఈ కీలక జాతీయ సదస్సు జరుగుతునుందున… ఆయిల్‌పామ్‌ రైతులకు మంచి రోజులు రానున్నాయని ఉద్యాన శాఖ వర్గాలు తెలిపాయి. మాదాపూర్‌ హెచ్‌సీసీ నొవాటెల్‌లో రెండు రోజులపాటు జరగనున్న సదస్సును.. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తొమర్‌ ప్రారంభించారు. ఈ సదస్సులో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సహా పలు రాష్టాల్ర మంత్రులు, కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి, పలు రాష్టాల్ర కార్యదర్శులు, కమిషనర్లు, ఐసీఏఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ త్రిలోచన్‌ మహాపాత్ర తదితరులు పాల్గొన్నారు. పంట సాగు చేసే 9 రాష్టాల్రకు చెందిన.. ప్రతినిధులు హాజరయ్యారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా… ప్రత్యేకించి తెలుగు రాష్టాల్లో ఆయిల్‌పామ్‌ పంట సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదతక పెంపు, రైతులకు ఇతోధిక రాయితీ, ఇతర ప్రోత్సాహకాలు, ఆదాయాలు పెంపు, ఆయిల్‌ పరిశ్రమ బలోపేతం, ఈ రంగంలో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. పామాయిల్‌ వినియోగంలో ఇండోనేషియా అగ్రస్థానంలో ఉండగా… భారత్‌ రెండో స్థానంలో ఉంది.