న్యూ ఇయర్ వేడుకలపై మళ్లీ ఆంక్షలు

అయినా తనిఖీలు తప్పవన్న ట్రాఫిక్ పోలీసులు
కొత్త సంవత్సర వేడుకలపై ఈ యేడు కూడా ఆంక్షలు తప్పడం లేదు. కరోనా ఒమిక్రాన్ దెబ్బతో మళ్లీ ఆంక్షలు మొదలయ్యాయి. దీంతో బహిరంగగంగా పార్టీలకు అవకాశం లేదు. కరోనా జాగ్రత్తలు, ఆంక్షల మధ్య నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా జరుపుకోవాలని నగర పోలీసులు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా వాహన తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తామని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నగరవ్యాప్తంగా వంద బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడిరచారు. మోతాదుకు మించి మద్యం సేవించి పట్టుబడితే.. వారిపై చట్టపరంగా చర్యలు
తీసుకుంటామని హెచ్చరించారు. డిసెంబర్ 31 రాత్రి 10 గంటల నుంచి జనవరి ఒకటో తేదీ 5 గంటల వరకు తనిఖీలు కొనసాగుతాయని పేర్కొన్నారు. మద్యం తాగి పట్టుబడిన వారి వాహనాలు జప్తు చేయడంతో పాటు వాహనదారులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. కేసులకు సంబంధించిన వివరాలు పాస్‌పోర్ట్, వీసా, ఆధార్ కార్డుకు అనుసంధాని స్తామని.. దీనివల్ల వారికి భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ప్రజలందరూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సూచించారు.