Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కారెక్కేందుకు రెడీ అవుతున్న జగ్గారెడ్డి…!

ఆయన తీరుపై జిల్లాలో కొంతకాలంగా చర్చ

తాజా లేఖతో కారణాలు వెదక్కున్నారని అనుమానం

కాంగ్రెస్‌ పార్టీని వీడేందుకు జగ్గారెడ్డి కారణాలు వెతుకుతున్నారా అంటే ఔననే సమాధానం వస్తోంది. గతంలో ఆయన వీడిని టిఆర్‌ఎస్‌ను మళ్లీ చేరేందుకు పావులు కదుపు తున్నారని గతకొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే తెలుస్తుంది. పిసిసి చీఫ్‌గా రేవంత్‌ రెడ్డిని నియమించిన నాటినుంచి జగ్గారెడ్డి కారాలు మిరియాలు నూరుతూనే ఉన్నారు. కాకపోతే కాంగ్రెస్‌ను ఎదరించే స్థితిలో లేకుండా పోయారు. రాజకీయంగా ఆయన కూడా పిసిసి పదవిని ఆశించి భంగపడ్డారు.

రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ సిద్దాంతాలకు అనుగుణంగా పనిచేయడంలేదని చెప్పడం ద్వారా కాంగ్రెస్‌ నుంచి బయటపడేందుకు బలమైన కారాణృాలను వెతుకున్నట్లుగా ఉంది. ఆయన టిఆర్‌ఎస్‌తో చేరుతారన్న ప్రచయచారం ఎప్పటి నుంచో ఉంది. రేవంత్‌  కార్పొరేట్‌ ఆఫీస్‌ తరహాలో పార్టీని నడుపుతున్నారని,. దీనిలో ఏదో మతలబు ఉందని… పార్టీ నేతలందరినీ కలుపుకొని పోయి కార్యక్రమాలు నిర్వహించడం లేదని చేస్తున్న ఆరోపణల్లో బలం లేదు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసేందుకోసం అందరినీ కలుపుకొని పోయి పనిచేసేలా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మైండ్‌సెట్‌ మార్చాలని లేదంటే కాంగ్రెస్‌ లైన్‌లో పనిచేసే మరో నాయకుడిని కొత్త అధ్యక్షుడిగా నియమించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి కాంగ్రెస్‌ అధిష్టానాన్ని కోరడంలో కూడా పెద్దగా కారణాలు కానరావడం లేదు. జగ్గారెడ్డి తీరు తెలసిన అధిష్టానం గతంలో అతడిని దూరం పెట్టింది. గతంలో ఓమారు ఎంపి టిక్కెట్‌ కోసం బిజెపిలో కూడా చేరిన జగ్గారెడ్డి రాజకీయంగా తనకు అవసరమైన మార్గాన్ని ఎన్నుకంటారన్న వాదనా ఉంది.

రాష్ట్రంలోని కాంగ్రెస్‌ పార్టీ నేతలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, పార్టీకి కూడా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయని లేఖలో తెలపడం చూస్తుంటే ఆయన అసలు రేవంత్‌ను ఇష్టపడడం లేదని తెలుసు. ఇకపోతే జగ్గారెడ్డి తీరుపై కాంగ్రెస్‌ పార్టీలోనూ వ్యతిరేకత ఉంది. ఆయన ఇటీవల కెటిఆర్‌ను కలసి మంతనాలు జరపడంపైనా కాంగ్రెస్‌ ఆరా తీసిందని సమాచారం. ఇవన్నీ ఇలా నడుస్తున్న క్రమంలో తాజాగా లేఖ రాయడం కూడా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌ అధిష్టానం కూడా ఎప్పటికప్పుడు సమాచార సేకరణ చేస్తోంది.

రేవంత్‌ వచ్‌ఇచన తరవాత కాంగ్రెస్‌లో ఊపు వచ్చిందన్న భావనలో అగ్రనేతలు ఉన్నారు. అయితే రేవంత్‌రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని, కేవలం పార్టీ కోణంలో మాత్రమే ఆలోచించి ఈ విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకువస్తున్నానని జగ్గారెడ్డి వెల్లడిరచారు. తాను ప్రస్తావించిన అంశాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని, పార్టీ కోసం అందరినీ కలుపుకొని పోయి పనిచేయాల్సిందిగా రేవంత్‌కు సూచించాలని జగ్గారెడ్డి కోరారు.

నిజానికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు ఇటీవల సంగారెడ్డి జిల్లాలో చేసిన పర్యటన  సందర్బంగా మంత్రి కేటీఆర్‌తో ఎమ్మెల్యే జగ్గారెడ్డి మంతనాలు జరిపారన్న చర్చ సాగుతోంది. ఆశ్చర్యానికి గురైన ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలు మామూలుగా ఏదైనా కార్యక్రమంలో అధికార, ప్రతిపక్ష నేతలు కలుసుకుంటే ఎడమొహం, పెడమొహంగా ఉంటారు. కానీ ఇక్కడ అలా కాకుండా కలివిడిగా గడిపారు. ఈ ఘటనతో ఇరుపార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.

నిత్యం టీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగే జగ్గారెడ్డితో కేటీఆర్‌ స్నేహపూర్వకంగా మెలగడం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అదీగాక కేటీఆర్‌ తన ప్రసంగంలో.. ’ఎన్నికలప్పుడు ఎవరైనా పోటీ చేయొచ్చు… ఇప్పుడు  మాత్రం అభివృద్ధిం కోసం కలిసి పని చేయాలి’ అని కోరడం ఆసక్తికరంగా మారింది.తాము ప్రతిపక్షానికి చెందిన ప్రజాప్రతినిధుల పట్ల ఎలాంటి వివక్ష చూపడం లేదనడానికి సంకేతంగా కేటీఆర్‌ అలా మాట్లాడారే తప్ప.. రాజకీయపరమైన కోణం లేదని కొందరు గులాబీ నేతలు సర్దిచెబుతున్నా.. లోలోన మాత్రం వారు కూడా ఇలా మాట్లాడటంలో అంతర్యం ఏమిటని ఆరా  తీస్తున్నారు.

జగ్గారెడ్డి పార్టీ మారుతున్నారన్న సంకేతాలు వచ్చాయి. సంగారెడ్డిలో పెద్ద రాజకీయ చర్చకే తెరతీశారని చర్చ నడుస్తోంది. రెండు పార్టీల కీలక నేతల మాటలు, సంభాషణలు ఏ పార్టీకి లాభనష్టాలు కలిగిస్తాయనే అంశాన్ని పక్కనపెడితే.. ఎవరూ ఊహించని విధంగా ఈ పరిణామాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇదిలావుంటే, కేటీఆర్‌, జగ్గారెడ్డిల తీరు.. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి చింతా ప్రభాకర్‌ అనుచరగణాన్ని కలవరపెడుతోంది.

2018 ఎన్నికల్లో జగ్గారెడ్డి స్వల్ప ఓట్ల మెజారిటీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన చింతా ప్రభాకర్‌పై విజయం సాధించారు. ఆ తర్వాత జగ్గారెడ్డి కాంగ్రెస్‌ను వీడి కారెక్కుతారనే ప్రచారం సాగింది. అయితే టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌తో ఉన్న విభేదాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా రేవంత్‌కు వ్యతిరేకంగా లేఖ రాయడంతో ఇప్పుడీ చర్చకు బలం చేకూరింది. ఆయన ఏ క్షణంలో అయినా కారెక్కడం ఖాయమని అనుచరులు కూడా చర్చించుకుంటున్నారు.