విపక్ష ఉద్యమాలకు కలసి వచ్చిన 2021
ప్రపంచ మొత్తం వరుసగా రెండో ఏడాది 2021 కూడా కరోనాతో అతలాకుతలమైంది. కొత్తగా ఒమిక్రాన్ భయాలు కొనసాగుతున్నాయి. ఈ భయం 2022లో కూడా కొనసాగనుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండ నంత కాలం ఒమిక్రాన్ కావచ్చు..మరే ఇతర వేరియంట్ కావచ్చు దాడి చేస్తూనే ఉంటుంది. అన్ని దేశాలతో పాటు భారత్ కూడా కరోనా తీవ్ర ప్రభావానికి గురయ్యింది. ఇప్పటికీ దీనిపీడ విరగడ అయ్యిందన్న ధీమా రావడంలేదు.
ఏడాదిలో సుమారు సగం రోజులు భయాలతోనే గడిచిపోయాయి. కరోనా తీవ్రత కారణంగా దేశానికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. నిరుద్యోగం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. స్థూల దేశీయోత్పత్తి జిడిపి బాగా క్షీణించింది. కరోనాను సాకుగా చూపి దేశంలోని కార్పొరేట్లు… వ్యాపారులు, భూస్వామ్యులు, బడా విదేశీ పెట్టుబడిదారులు బలపడ్డారు. అంతిమంగా సామాన్యులు బాగా బలహీనపడ్డారు.
ఈ కారణంగా 2021 సంవత్సం ప్రజలకు తీరని వేదన మిగిల్చింది. ఓ రకంగా వరుసగా రెండేళ్లు ప్రజలకు తీరని నష్టాన్ని కలిగించింది. ఇదోపక్క ఇలా ఉండగానే అనేక ఆందోళనలు కూడా దేశాన్ని అతలాకుతలం చేశాయి. ప్రధానంగా దేశంలో సాగుచట్టాలపై రైతుల ఉద్యమం దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కించింది.
ఈ యేడాది చివరలో సాగుచట్టాల రద్దుతో రైతులు ఆందోళనలు విరమించి ఇళ్లకు వెళ్లిపోయారు. ఇంతటి మహోద్యమం కూడా ఈ యేడే కావడం గమనించాలి. ఇక రాజకీయంగా అన్ని పార్టీలు మల్లీ గళం విప్పుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్, బిజెపిలు అధికార టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలకు పునాది వేశాయి.
ధాన్యం సేకరణ, నిరుద్యోగం తదితర అంశాలతో పోరాడుతున్నాయి. ధాన్యం సేకరణలో టిఆర్‌ఎస్ కూడా కేంద్రంలోని బిజెపిని లక్ష్యంగా చేసుకుని ఉద్యమించింది. సిఎం కెసిఆర్ స్వయంగా ధర్నాకు దిగారు. ఓ రకంగా విపక్ష బిజెపి, కాంగ్రెస్ పార్టీలు బాగా ఉద్యమాలతో ముందుకు వెళ్ళే క్రమంలో బలం పుంజుకున్నాయను చెప్పాలి.
హుజూరాబాద్ ఎన్నికతో బిజెపికి కొంత ఊపు వచ్చింది. చచ్చు పడిపోతున్న దశలో కాంగ్రెస్ పార్టీకి గళం విప్పే అవకాశం చిక్కింది. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతోంది. అలాగే ఎపిలో అమరావతి ఉద్యమం బాగా బలపడిరది. జగన్‌కు వ్యతిరేకంగా రైతులు ప్రజా ఉద్యమాన్ని నిర్మించగలిగారు. తాజాగా ఓటిఎస్ పథకంపై ఎపిలో ప్రజాగ్రహం వ్యక్తం అవుతోంది. దీనిని ఆసరగా చేసుకుని టిడిపి ఆందోలను చేపట్టింది. మొత్తంగా తెలుగు రాష్టాల్ల్రో అధికార పార్టీలకు వ్యతిరేకత బాగా బలపడి౦దనే చెప్పాలి.
దేశవ్యాప్తంగా మూలనపడ్డ పార్టీలన్నీ మరోమారు నిలదొక్కునే యత్నాలు మొదలు పెట్టాయి. సాగుచట్టం ద్వారా విపక్షాలు రాజకీయ లబ్దిపొందే యత్నాల్లో కొంతమేర విజయం సాధించాయని చెప్పాలి. వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరును తమకు అనుకూలంగా మలచుకుని పోరాటంలో సఫలీకృతం కావాలనుకున్నా..అంతిమ విజయం రైతులకే దక్కింది.
సాగు, వాణిజ్యం, నిల్వలతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరలపై రైతులు ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నారు. ఇకపోతే సాగుచట్టాలపై కొంత వెనక్కి తగ్గామని కేంద్రమంత్రి తోమర్ చేసిన వ్యాఖ్యలు చూస్తే కత్తి వేళాడుతునే ఉందని గమనించాలి. విద్యుత్ చట్టంలో కూడా సవరణలు చేపట్టేందుకు కేంద్రం బిల్లును తీసుకువస్తోంది. దీంతో సబ్సిడీపై విద్యుత్ పొందే అవకాశాన్ని దేశ వ్యాప్తంగా ఉన్న రైతన్నలు కోల్పోవడం ఖాయమన్న ప్రచారం ఉంది. వ్యవసాయ చట్టాలతో పాటు ఈ బిల్లుతో రైతుల్లో తీవ్రస్థాయిలో ఆందోళనలు మొదల య్యాయి. ఈ చట్టాలు, బిల్లులతో వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, చిన్న, సన్న కారు రైతులపై తీవ్ర ప్రభావం చూపుతుందనిన్న ప్రచారం కూడ సాగడంతో రైతులు ఢల్లీిలో చేపట్టిన ఆందోళన చేస్తున్నారు.
భారత వ్యవసాయ రంగాన్ని బడా వ్యాపారులు చేతుల్లో పెట్టేందుకు మోడీ సర్కార్ తలుపులు బార్లా తెరవడంతో జరిగిన ఆందోళనకు ఎట్టకేలకు మోడీ దిగివచ్చి సాగుచట్టాలను రద్దు చేసారు. ఇకపోతే రానున్న సంవత్సరంలో కొత్తగా ఐదు రాష్టాల్ర ఎన్నికల నేపథ్యంలో విపక్షాలు మరోమారు బిజెపి లక్ష్యంగా కత్తులు దూసుకున్నాయి.
ఈ యేడాది జరిగిన బెంగాల్ ఎన్నికల్లో బిజెపి అధికారం సాధించకపోయినా గణనీయమైన సీట్లను సాధించి బాగా బలపడిరదనే చెప్పాలి. అయితే బలంగా ఉన్న బిజెపిని దెబ్బకొట్టేందుకు ఏకమ య్యేందుకు చిన్నపార్టీల్లో ఐక్యత కానరావడం లేదు. బిజెపిని ఇప్పటికిప్పుడు దెబ్బకొట్టడం అంత సులువు కాకపోవచ్చు. అయితే వ్యవసాయ చట్టాలు తదితర అంశాలు విపక్షాలు బలపడేందుకు ఆస్కారం కలిగించాయనే చెప్పవచ్చు. విపక్షాల ఐక్యతకు సంబంధించి కాంగ్రెస్ ను గట్టిగా ఎదిరించే క్రమంలో మమతాతా బెనర్జీలాంటి రాజకీయ అవకాశవాద నేతల రంగు బయటపడి౦ది.
దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఢిల్లీ , ఉత్తరాదిన జరుగుతున్న నిరసన ప్రదర్శనలతో దేశ రాజకీయ వాతావరణం లో ఒక్కసారిగా తమకు అనుకూలంగా మార్పును తీసుకుని వచ్చామని ఆయా పార్టీలు చంకలు గుద్దు కుంటున్నాయి. ఇది దేశంలో దాదాపు అన్ని పార్టీలను ఒక వైపు, భారతీయ జనతా పార్టీని మరో వైపు సవిూకృతం చేశాయనడంలో సందేహం లేదు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడి౦దని చెప్పడం ద్వారా విపక్షాలు ప్రజల్లోకి వెళ్లడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీని దెబ్బకొట్టే అవకాశాల గురించి ప్రతిపక్షాలు ఐక్యంగా మాత్రం ముందుకు రాలేక పోతున్నాయి.
దాదాపు బిజెపియేతర పార్టీలన్నీ కలిసికట్టుగా ప్రజల ఆందోళనను నిర్మించేందుకు అవకాశాలు ఉన్నా ఆ ప్రయత్నాలను ముమ్మరం చేయడంలో విఫలం అయ్యాయి. అన్ని రకాల శక్తులు కలిసికట్టుగా ఆందోళనకు దిగుతూ, తటస్థంగా ఉన్న వారిని కూడా తమ వైపుకు లాగడం ద్వారా బిజెపికి వ్యతిరేకంగా పరిస్థితిని తీసుకుని వచ్చామని భ్రమపడుతున్నాయి.
మోదీ హిందూత్వ, దేశభక్తి కార్డులను విజయవంతంగా ఉపయోగించు కొన్నప్పుడల్లా ప్రతిపక్షాలు నీరుకారి పోయాయి. విపక్షాలు ఏకం కావడంవల్ల బిజెపికి లాభించే పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశవ్యాప్తంగా బిజెపి యేతర రాజకీయ పార్టీలు, అనేక ఇతర వర్గాలు సంఘటితం కావాలనే బిజెపి కోరుకుంటుందని భావించాలి. అయితే కరోనా కావచ్చు, వ్యవసాయ చట్టాలు కావచ్చు ప్రజల కోణంలొ ఆలోచించాల్ని బాధ్యత విపక్షాలపై ఉంది. ప్రజల సమస్యలను పట్టించుకోవడంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కావచ్చు.. ఉభయ తెలుగు రాష్టాల్ల్రో ఉన్న వైసిపి, టిఆర్‌ఎస్‌లు కూడా మాత్రం పూర్తిగా విఫలం అయ్యాయి.