నదీజలాల వివాదం… సీఎస్‌లతో నేడు కేంద్రం భేటీ
నదీజలాల వివాదం
తెలుగు రాష్టాల్ర సీఎస్‌లతో కేంద్రం నేడు భేటీ
రెండు తెలుగు రాష్టాల్ర మధ్య నదీ జలాల వివాదాలు ఎంతకూ తెగకపోవడంతో కేంద్ర ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగుతోంది. వివాదాల పరిష్కారంలో జోక్యం చేసుకోవడానికి సిద్ధమైంది. కృష్ణా, గోదావరి నదీ బోర్డుల పరిధి అమలు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కేంద్రం.. రాష్టాల్రతో చర్చించేందుకు రంగంలోకి దిగింది. నాలుగు కీలకమైన అంశాలపై చర్చించేందుకు మంగళవారం తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. విూటింగ్ లో చర్చించబోయే అంశాలపై కేంద్ర జలశక్తి మంతిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్.. రెండు రాష్టాల్ర ప్రధాన కార్యదర్శులు సోమేశ్ కుమార్, సవిూర్ శర్మకు లేఖ రాశారు. రెండు రాష్టాల్లో ప్రాజెక్టులు బోర్డుల పరిధిలోకి తీసుకురావాలని గతంలో కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.