రాహుల్ మార్కు రాజకీయాల దిశగా కాంగ్రెస్
రాష్టాల్ల్రో స్థానిక సమస్యలపై పోరాటమే ప్రధాన ఎజెండా
మారనున్న రాహుల్ రణనీతి..దూకుడు నేతలకే ప్రాధాన్యం
న్యూఢల్లీి : రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టాక కాంగ్రెస్‌లో భారీ మార్పులు ఉంటాయన్న వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం ఏదీ కనిపించలేదు. అయితే చాపకింది నీరులా ప్రయత్నాలు సాగుతున్నాయన్న సమచారం మాత్రం ఉంది.
కాంగ్రెస్‌లో ఈ చర్చ సాగుతోంది. రాహుల్ ఓ బలమైన టీమ్‌తో ముందుకు రావాలని చూస్తున్నారు. ముందు ఐదురాష్టాల్ర ఎన్నికలు, ఆ తరవాత సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాహుల్ పక్కా ప్లాన్‌తో ఉన్నారని సమాచారం. అందుకు అనుగుణంగా అనుసరించాల్సిన రాజకీయ వ్యూహంతో పాటు, నమ్మదగిన బృందాన్ని ఎంపిక చేసుకుని ముందుకు సాగనున్నారు. ఇందులో భాగంగా ఆయా రాష్టాల్ల్రో గట్టిగా పోరాడే యువరక్తాన్ని ఒడిసిపట్టుకునే ప్రయత్నాలు చేయవచ్చు.
తెలంగాణనే తీసుకుంటే ఇక్కడ తెలంగాణ ఏర్పాటు, కాంగ్రెస్ కృషితో పాటు మాజీ ప్రధాని పివి గురించి సానుకూల వచనాలు చెప్పేలా ప్రచార ప్రణాళిక సిద్దం చేయబోతున్నారు. రేవంత్ రెడ్డి లాంటి దూకుడున్న నేతలను ముందు వరసలో నిలబెట్టారు. ఇక్కాడా సామాజిక వర్గాలను చేరదీస్తారని ప్రచారం సాగుతోంది. కెసిఆర్‌కు వ్యతిరేకంగా ఉన్న వివిధ వర్గాలను కూడగట్టుకుని, స్థానిక సమస్యలే ఎజెండాగా ముందుకు సాగేందుకు పక్కా ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో స్థానిక సమస్యలే ఎజెండాగా ప్రస్తావన ఉండేలా చూడబోతున్నారు. నోట్లరద్దు, జిఎస్టీ వల్ల దెబ్బతిన్న రంగాలను అవే సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్‌లో రాహుల్ శకం ప్రాంభం కావడంతో ఇప్పుడు పరిస్థితి మారుతున్నట్లు కనపడుతున్నది. దేశంలో బీజేపీయేతర శక్తులన్నిటినీ కూడగట్టుకుని అధికారంలోకి వచ్చి తమది లౌకిక ఫ్రంట్‌గా ప్రకటించుకున్న సోనియాగాంధీకీ, ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టబోతున్న రాహుల్ గాంధీకి మధ్య ఎంతో తేడా కనిపిస్తున్నది.
తనను ఒక భక్తి విశ్వాసాలున్న హిందువుగా చిత్రించుకునేందుకు రాహుల్ తాపత్రయ పడుతున్నారు. గత ఎన్నికల సమయంలో ముస్లింలు దుర్భర స్థితిలో ఉన్న ప్రాంతాలను సందర్శించలేదు. ఒక్క మసీదు మెట్లు కూడా ఎక్కలేదు. ప్రచారంలో ముస్లింలతో ఫోటోలు దిగి ప్రాచారం చేసుకోలేదు. ఇవన్నీ వ్యూహాత్మకంగా చేసినవే తప్ప యధాలాపంగా చేసినవి కావు.
మోడీ లాంటి బలమైన నాయకుడిని ఢీకొనేందుకు రాహుల్ అవలంబించిన సరికొత్త వ్యూహంగా చూడాలి. అందుకే తనకంటూ ప్రత్యేక దళాన్ని రాహుల్ రూపొందించుకోబోతున్నారు. అనేక రాష్టాల్ల్రో కాంగ్రెస్ పరాజయం చెందినప్పటికీ రాహుల్ నాయకత్వంపై విశ్వాసం పెరిగింది. అలాగే తమది హిందువుల పార్టీయే అన్న సంకేతాలు పంపించేందుకు వీలుగా రాహుల్ గాంధీ ఎన్నికల పరాజయం తర్వాత కూడా హిందుత్వపై పదేపదే వ్యాఖ్యలు చేస్తున్నారు.
ముస్లింలను ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు తాము అనుసరించిన విధానాలే బెడిసి కొట్టాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారనడానికి ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదు. దేశంలో ముస్లింల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు జస్టిస్ రాజేందర్ సచార్ నేతృత్వంలో కమిషన్‌ను నియమించిన కాంగ్రెస్ పార్టీయే ఇప్పుడు ముస్లింలను విస్మరించడానికి సైతం సిద్ధం అవుతోంది.
10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలు, అవినీతి ప్రధానంగా నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ విజయం సాధించడానికి దారితీశాయి. హిందూత్వ రాజకీయాలే బీజేపీని అధికారంలోకి తేగలిగితే ఆ తర్వాత ఢల్లీి, బీహార్ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ విజయం సాధించి ఉండేది. హిందూత్వ విధానాలే మోదీని గెలిపిస్తే గుజరాత్‌లో గ్రావిూణ ప్రాంతాల్లో బీజేపీ దెబ్బతినేది కాదు. అందుకే రాహుల్ రెండు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
పాతుకుపోయిన వృద్ద జంబుకాలను కేవలం సూచనలకే పరిమితం చేయనున్నారు. అలాగే దూకుడు నేతలను ముందు వరసలోకి తీసుకుని వస్తున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆకళింపు చేసుకుని ఆయా రాష్టాల్ల్రో ఉన్ననేతలను గుర్తించి ముందుకు సాగేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.
రాష్టాల్ల్రో కాంగ్రెస్‌ను పట్టుకుని వేళ్లాడుతున్న గబ్బిలాలతో లాభం లేదనుకుంటే సున్నితంగా పక్కన పెట్టడంలోనూ రాహుల్ వెనకాడక పోవచ్చు. వచ్చే ఏడు రాహుల్ మరోమారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకావాలు ఉన్నాయి. ఈలోగా పార్టీని పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.