Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న ప్రభుత్వాలు ! 

దేశంలో నిరుద్యోగం తాండవిస్తోంది. ఉద్యోగా,ఉపాధి రంగాలపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్న కారణంగా కోట్లాదిమంది నిరుద్యోగులు పట్టాలు చేతుల్లో పట్టుకుని దిక్కుతోచకుండా ఉన్నారు. కరోనా మహమ్మారి దాడితో ఇక మరింత ఉపద్రవం ఏర్పడిరది. ధరలు దాడిచేస్తున్నాయి. ఉత్పత్తి రంగాలకు చేయూల లేకుండా పోయింది. కేవలం కార్పోరేట్‌ కంపెనీలను ప్రోత్సహిస్తున్న తీరు కారణంగా చిన్న కంపెనీలు అనేకం మూడపడ్డాయి. దీనికితోడు జిఎస్టీ దాడి విపరీతంగా ఉంది. తాజాగా చేనేతరంగంపై 5శాతం ఉన్న జిఎస్టీని ఏకంగా 12శాతానికి పెంచారు.

ప్రభుత్వమంటే పన్నుల వసూళ్లు తప్ప మరోటి కాదన్న రీతిలో కార్యక్రమాలు సాగుతున్నారు. ప్రభుత్వరంగ పరిశ్రమలను ఇష్టం వచ్చినట్లుగా అమ్మకానికి పెట్టారు. ఈ క్రమంలో దేశాన్ని మార్గనిర్దేశనం చేయాల్సిన పాలకలు ఎన్నికలు, ఎన్నికలకు అవసరమైన పథకాల పేరుతో ముందుకు సాగుతున్నారు. ఒక ఎన్నిక నుంచి మరోఎన్నిక అన్నతీరులో పాలనసాగుతోంది. కేంద్రం దారిలోనే అన్ని రాష్టాల్ల్రో పాలన ఉంది. యధారాజా తథా ప్రజా అన్న తీరులో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను వేపుకుతింటున్నాయి.

పండి౦చిన ధాన్యానికి గిట్టుబాటు ధరలు దక్కడం లేదు. పండి౦చిన ధాన్యం కొనే భరోసా లేదు. కేంద్రరంగ సంస్థలను ఇష్టం వచ్చినట్లుగా అమ్మేసే కార్యక్రమం జోరుగా సాగుతోంది. మూతపడ్డ పరిశ్రమల సంగతి సరేసరి. మోడీ ప్రభుత్వం ప్రభుత్వరంగా సంస్థలను తెగనమ్ముతున్నది వాస్తవం కాదనడలమా. విశాఖ ఉక్కు లాంటి సంస్థలను తెగనమ్మేందుకు కూడా వెనకా డడం లేదు. కొత్త ఉద్యోగాల నియామకాల మాట దేవుడెరుగు కానీ ఉన్న ఉద్యోగులకు విఆర్‌ఎస్‌, సిఆర్‌ఎస్‌ ఇచ్చి ఉద్యోగాలను ఊడగొట్టిన పాపంలో అందరూ పాలుపంచుకుంటున్నారు. ఇన్నాళ్లు ఉద్యోగావకాశాలు ఇచ్చిన అనేక కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేసి మరికొందరికి ఉపాధి కల్పించాల్సిన కేంద్రం ప్రైవేటు పరం చేస్తూ ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు ఉద్యోగావకాశాలను దెబ్బతీస్తున్నారు.

దేశానికి, యువతకు ’అచ్చే దిన్‌’ అంటూ అశ చూపి, రెండుసార్లు అధికారంలోకి వచ్చిన విూ బిజెపి ప్రభుత్వం దేశ నిరుద్యోగ యువతకు ఏం చేసిందో చెప్పాల్సి ఉంది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన విూ హావిూని గంగలో కలిపారు. ఇప్పటిదాకా ఎన్ని కోట్ల కొలువులు ఇచ్చారో చెప్పే దైర్యం మోడీ సర్కార్‌కు లేదు.
ఉద్యోగావకాశాలు కల్పించకుండా పోవడంలో కేంద్ర రాష్ట్ర పక్రభుత్వాలు పోటీపడుతున్నాయి. ఈక్రమంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామన్న ఆశలు చూపిన బిజెపి హావిూ ఏమైందన్న విమర్శలకు సమాధానం లేదు.

రాష్టాల్రు,కేంద్రం ఇప్పటి వరకు ఎన్ని కొలువులు ఇచ్చిందో లెక్క చెప్పడం లేదు. దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం ఏంచేసిందో చెప్పాలని ఆయా రాష్టాల్ల్రో ఉన్న ప్రాంతీయ పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. కానీ తమ రాష్ట్రంలో ఏ మేరకు నిరుద్యోగులను ఆదుకున్నామో చెప్పలేకపోతున్నారు. కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు…ఉన్న ఉద్యోగాలనే మోడీ ప్రభుత్వం తొలగిస్తోందన్నది నూటికినూరుపాళ్లు నిజం.

ఉపాధి అవకాశాల్లో బిజెపి వైఫల్యాలను తీవ్రస్థాయిలో నిరుద్యోగులు నిరసిస్తూనే ఉన్నారు. అదే సమయం లో ఉపాధి కల్పనలో రాష్ట్ర ప్రభుత్వలు కూడా నిర్లక్ష్యం చేస్తున్నాయి. ప్రజలను తప్పుదారి పట్టించడానికే ఎప్పటికప్పుడు మసిపూసి మారేడుకాయ చేసక్తున్నారు. ప్రభుత్వాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవ డానికి, అన్నిరంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తున్నట్లుగా అబద్దాల ప్రచారంలో ముందున్నాయి.

ధాన్యం ఉత్పత్తిలో స్వాలంబన సాధించినా దేశంలో పేదరికాన్ని, నిరుద్యోగాన్ని తొలగించడం లేదు. అనేక మంది పేదలు ఇంకా ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు. చరిత్రలోనే రికార్డు స్థాయికి ధాన్యం ఉత్పత్తిని
అన్నదాతలు ఉత్పత్తి చేస్తున్నా..వారికి మద్దతు ధరలు కూడా దక్కకుండా చేస్తున్నారన్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభంతోపాటు, ప్రజలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోలేక సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నారు. ప్రతి రాష్ట్రంలో ఏటా లక్షలాది యువతీ యువకులు డిగ్రీలతో బయటికి వస్తున్నారు. డిగ్రీ పూర్తయిన అందరికీ ఉద్యోగాన్ని ప్రపంచంలో ఏ దేశమూ, ఏ ప్రభుత్వ మూ కల్పించలేదు. కానీ ఉపాధి కల్పించడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. అలాగని కేంద్రంలోని ప్రభుత్వం అన్నీ చేయాలని ఎవరూ కోరుకోవడం లేదు. కానీ విధానాలు సక్రమంగా ఉంటే కేంద్ర, రాష్టాల్రు కలసి ఉపాధి అవకాశాలు పెంచవచ్చు.

ఉపాధి కల్పనలో తమ నిబద్ధతను చాటిచెప్పేలా సాధ్యమైనంత ఎక్కువమందికి ప్రభుత్వరంగంతో పాటు ప్రైవేట్‌ రంగంలోనూ లక్షలాది ఉపాధి,ఉద్యో అవకాశాలను కల్పించ వచ్చు. ఉద్యోగ కల్పనలో అత్యద్భుత విజయాలు సాధించామని చెప్పకుంటున్న ఉభయ తెలుగు రాష్టాల్ల్రో కూడా నిరుద్యోగం తాండవిస్తోంది. లక్షల ఉద్యోగాల భర్తీ హావిూని మించి రాష్ట్ర ప్రభుత్వం లక్షా ముప్పై మూడు వేలకుపైగా ఉద్యోగాలు ఇచ్చిందన్న ప్రచారంలో టిఆర్‌ఎస్‌ నేతలు మునిగి తేలుతున్నారు. ఇక ఎపిలోనూ ఇదే తరహా ప్రచారంలో జగన్‌ ప్రభుత్వం డాంబికాలు పలుకుతోంది.

గ్రావిూణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు కులవృత్తులపైన ఆధారపడిన లక్షలమందికి తమ కాళ్ళపై తాము నిలబడేలా చేయూతనందించే కార్యక్రమాలు చేపడితే ..గ్రావిూణ ఆర్థిక వ్యవస్థ బలపడగలదు. ఎక్కడిక్కడ ఇలాంటి కార్యక్రమాలు విస్తృతం చేయాలి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇవ్వాలి. నిరుద్యోగులకు బ్యాంకులు ఉదారంగా రుణాలు ఇవ్వాలి.

నిర్మాణరంగంలో ప్రోత్సాహకాలు పెంచాలి. ధరలను అదుపు చేయగలగాలి. ఇవన్నీచేసే అవకాశాలు ఉన్నా చేయడానికి ధైర్యం చాలడం లేదు. కేఊవలం కార్పోరేట్లను బతికించే పథకాలు తప్ప ప్రభుత్వాలు ప్రజలకు చేస్తున్నది శూన్యం. ఇకనైనా ప్రభుత్వాల ఓటుబ్యాంక్‌ రాజకీయాలను ప్రజలు గుర్తించి ఎప్పికప్పుడు తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉండాలి.