ఆ కార్యదర్శి లీలలు …!

– ఒకరి ఇంటి కాళీ స్థలాన్ని, మరొకరి పేరు పై
– ఇంటిని కట్టినట్లుగా ఆన్లైన్ లో పొందుపరిచిన పంచాయతీ కార్యదర్శి.
– డబ్బులకు దాసోహం…. లబోదిబోమంటున్న భూమి యజమాని
తుంగతుర్తి : తుంగతుర్తి మండల కేంద్రంలో, ప్రముఖ రాజకీయ నాయకుడు ఒకరు తన భూమిని ప్లాట్లుగా చేసి చర్లపల్లి వెంకన్నకు అమ్మి నాడు. అతనికి తెలియ కుండానే ఆ భూమిపై ఇల్లు కట్టినట్లుగా, మరొకరికి ఇచ్చినట్లుగా తుంగతుర్తి గ్రామపంచాయతీ కార్యదర్శితో మమేకమై… ఆ నాయకుడు డబ్బులు ఏర చూపగా… ఆన్లైన్లో బీర పూల నారాయణగా నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు, ఇంటిని కట్టినట్టుగా.. బిల్లు తో కూడిన రసీదును కార్యదర్శి ఇచ్చాడు. ఈ అవినీతి సంఘటన శుక్రవారం జరిగిన గ్రామ సభలో ఆలస్యంగా వెలుగు చూసింది., స్థానిక సర్పంచ్ సంకినేని .స్వరూప రవీందర్రావు శుక్రవారం గ్రామ సభను ఏర్పాటు చేసి, వార్డు మెంబర్‌లతో ఏకీభవించి ,ఏ పనికైనా చేసుకోవటానికి ,తీర్మానాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా వీరబోయిన బిక్షం నా ఇంటి స్థలాన్ని వేరొకరు ఇల్లు కట్టినట్టుగా ఆన్లైన్లో, కార్యదర్శి నమోదు చేసినట్లు ఫిర్యాదు చేసినట్లుగా సర్పంచ్ కు తెలియ పరచ గా. జరిగిన సంఘటన పై పూర్తిగా విచారించగా, పంచాయతీ కార్యదర్శి అవినీతి బాగోతం బట్టబయలైంది .జరిగిన సంఘటనపై తుంగతుర్తి ఎంపీడీవో కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది . దీనితో ప్రస్తుతం ఆన్లైన్లో బీర పూల నారాయణ పేరును తీసి వేసినట్లు పేర్కొన్నారు. గ్రామంలో ఇటువంటి సంఘటన జరుగుతుండడంతో వార్డు మెంబర్లు, ప్రజలు, గ్రామ సభలో నివ్వెరపోయారు. జరిగిన అవినీతి భాగోతం పై జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయిలో విచారణ జరిపి, ఇష్టారాజ్యంగా ప్రవర్తించి , డబ్బులకు దాసోహమై ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న, కార్యదర్శి మధు పై , విచారణ జరిపి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు, గ్రామ ప్రజలు కోరుతున్నారు.