రెండు డోసులు తీసుకున్న 33 మందికి ఒమిక్రాన్

డిల్లీ ఆస్పత్రిలో నమోదయిన కేసులు
భారత్‌లో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ బాధితులలో వ్యాక్సినేషన్ రెండు డోసులు తీసుకున్నవారే ఎక్కవగా ఉండడం ఆందోళన కలిగిస్తున్న విషయం. దేశ రాజధాని డిల్లీ లోని లోక్ నాయక్ ఆస్పత్రిలో 34 మంది ఒమిక్రాన్ చికిత్స కోసం చేరగా.. వీరిలో 33 మంది పూర్తిగా వ్యాక్సినేషన్ తీసుకున్నవారు ఉన్నారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
ఈ 34 మందిలో 18 మంది పూర్తిగా కోలుకున్నారని లోక్ నాయక్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ సురేష్ కుమార్ చెప్పారు. బాధితులలో ఇద్దరు విదేశీ ప్రయాణికులు బూస్టర్ డోసు కూడా తీసుకున్నారని ఆయన అన్నారు.
ఒమిక్రాన్ సోకిన వారిలో ఊపిరి సమస్యలు తక్కువగా ఉండడం ఊరట కలిగిస్తున్న విషయం. ఇది వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే అయిఉంటుంది.. అందువల్ల వ్యాక్సిన్ తీసుకోని వారికి ఒమిక్రాన్ సోకితే వారిలో ఆరోగ్య సమస్యలు తీవ్రంగా ఉండే అవకాశముందని డాక్టర్ సురేష్ అభిప్రాయపడ్డారు.
లోక్ నాయక్ ఆస్పత్రిలో చేరిన 34 ఒమిక్రాన్ బాధితుల్లో అయిదుగురు యూరప్, ఆఫ్రికా దేశస్తులు ఉండడం గమనార్హం. ఢల్లీిలో ఇప్పటివరకు 57 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మిగతా రాష్టాల్రతో పోలీస్తే ఒమిక్రాన్ కేసులు ఢల్లీిలోనే అధికం.