నగరంలోని 10 పబ్‌లకు హైకోర్టు నోటీసులు

జనావాసాల నుంచి తొలగించాని పిటిషన్
హైదరాబాద్ నగరంలోని 10 పబ్‌లకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 31లోగా పబ్‌లను కట్టడి చేయాలని సూచించింది. రెసిడెన్షియల్ ప్రాంతంలో పబ్‌లకు అనుమతి ఇస్తున్నారంటూ.. దాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో 10 పబ్‌లకు నోటీసులు జారీ చేసింది. ఈ పది పబ్‌లు పూర్తి స్థాయిలో నివాసిత ప్రాంతాల్లో ఉన్నాయని, పబ్లిక్‌కు చాలా ఇబ్బందిగా మారిందని, అ పబ్‌లకు ఏ విధంగా అనుతిచ్చారో.. వాటన్నింటిపై పూర్తి స్థాయిలో కౌంటర్ దాఖలు చేయాలని ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణ ఈనెల 29కి వాయిదా వేసింది. కాగా పబ్‌ల అరాచకాలపై జూబ్లీహిల్స్ రెసిడెన్షియల్ అసోసియేషన్స్ సభ్యులు పిటిషన్ వేశారు..