Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఓటరు కార్డుతో ఇకనుంచి ఆధార్‌ అనుసంధానం

ఎన్నికల సంస్కరణల్లో కీలక ముందడుగు
బోగస్‌ ఓట్లకు చెక్‌ పెట్టే ప్రయత్నంలో చట్టం
ఎన్నికల సంస్కరణళో మరో కీలక అడుగు పడిరది. బోగస్‌ కార్డుల ఏరివేతలో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఓటరు కార్డుతో ఆధార్‌ అనుసంధానికి సంబంధించిన బిల్లుకు లోక్‌సభలో ఆమోదం దక్కింది. ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021.. మూజువాణి ఓటు ద్వారా ఆమోదం పొందింది.

సోమవారం మధ్యాహ్నం స్వల్ప చర్చ తర్వాత ఎన్నికల చట్టాల సవరణ బిల్లును ఆమోదించారు. ఈ బిల్లు ఆమోదంతో ఇప్పుడు ఓటరు కార్డుతో ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి అయ్యింది. ఇక నుంచి ఓటు రిజిస్టర్‌ చేసుకోవాలనుకునే వారి నుంచి ఎన్నికల రిజిస్టేష్రన్‌ ఆఫీసర్లు ఆధార్‌ నెంబర్‌ను తీసుకుంటారు.

ఐడెంటినీ గుర్తించేందుకు ఇది అవసరం అవుతుందని మంత్రి కిరణ్‌ రిజిజు తెలిపారు. మూజు వాణి ఓటు ద్వారా బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఉదయం ఎన్నికల చట్టాల సవరణ 2021 బిల్లును మంత్రి రిజిజు ప్రవేశపెట్టారు. ఆ బిల్లును విపక్షాలు వ్యతిరేకించాయి. ఓటరు కార్డుతో ఆధార్‌ను లింక్‌ చేయాలన్న ఉద్దేశంతో ఎన్నికల చట్టాల సవరణ బిల్లును కేంద్రం తీసుకువచ్చింది. లోక్‌సభలో ఈ బిల్లును విపక్షాలు వ్యతిరేకించాయి. బోగస్‌ ఓటింగ్‌, నకిలీ ఓటింగ్‌ను నిర్మూలించాలంటే ఈ బిల్లుకు ఆమోదం తప్పదని మంత్రి రిజిజు తెలిపారు.

ఆధార్‌ చట్టం ప్రకారం ఆధార్‌ను ఓటర్‌ కార్డుతో అనుసంధానం చేయరాదు అని కాంగ్రెస్‌ నేత మనీష్‌ తివారీ అన్నారు. ఎన్నికల చట్టాల సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. విపక్ష నేతలు అసదుద్దీన్‌ ఓవైసీ, శశిథరూర్‌ కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు.

ఆధార్‌ను కేవలం అడ్రస్‌ ప్రూఫ్‌గా వాడారని, కానీ అది పౌరసత్వ ద్రవీకరణ పత్రం కాదు అని శశిథరూర్‌ అన్నారు. ఓటర్లను ఆధార్‌ అడిగితే, అప్పుడు కేవలం అడ్రస్‌ డాక్యుమెంట్‌ మాత్రమే వస్తుందని, అంటే పౌరులు కాని వారికి విూరు ఓటు వేసే హక్కు కల్పిస్తున్నట్లు అవుతుందని ఎంపీ శశిథరూర్‌ ఆరోపించారు. ఎన్నికల చట్టాల సవరణ బిల్లును స్టాండిరగ్‌ కమిటీకి సిఫారసు చేయాలని కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి తెలిపారు.