Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఓటిఎస్‌ రద్దు కోరుతూ టిడిపి ఆందోళన

ప్రభుత్వ దోపిడీని అడ్డుకోవాలని పిలుపు
ఓటీఎస్‌ను రద్దు చేయాలంటూ టీడీపీ ఆందోళనకు దిగింది. పటమట తహశీల్దారుకు వినతి పత్రం అందచేసింది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మాట్లాడుతూ.. జగన్‌ పరిపాలన తుగ్లక్‌ చర్యలకు మించి సాగుతోందన్నారు. పన్నుల భారాలతో ప్రజలను దోచుకుంటున్నారన్నారు. తుగ్లక్‌ ఉదంతం చరిత్రలో చదివితే.. జగన్‌ లైవ్‌లో చూపిస్తున్నారన్నారు. ఇంకా గ్దదె రామ్మోహన్‌ మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్‌, చంద్రబాబుల హయాంలో పేదలకు ఇళ్లు కేటాయించారు. కేంద్రం సహకారంతో కట్టిన ఇళ్లకు ఇప్పుడు డబ్బులు కట్టమనడం ఏమిటి? వన్‌ టైం సెటిల్‌మెంట్‌ పేరుతో ప్రజలను డబ్బులు కట్టాలని కోరడం వింతగా ఉంది. మద్యం, ఇసుక వ్యాపారం మొత్తం జగనే చేస్తున్నారు. పేదలను టార్గెట్ చేసుకుని కోట్లు దోచుకోవడం దుర్మార్గం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హావిూలను అమలు చేయకుండా మోసం చేశారు. భస్మాసుర హస్తం తరహాలో… జగన్‌ను నమ్మితే.. ప్రజలను పీల్చుకు తింటున్నారు. సంబంధం లేని కారణాలు చెప్పి పన్నులు వేస్తున్నారు. పథకాలను రద్దు చేస్తామని భయపెట్టి డబ్బులు కట్టించుకుంటున్నారు. నాట్‌ విల్లింగ్‌ అనే ఆప్షన్‌ ఎందుకు తీసేశారో ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. ప్రజలు భయపడవద్దు… జగన్‌ ప్రభుత్వం దోపిడీని అందరం అడ్డుకుందాం‘ అని పేర్కొన్నారు.