ధాన్యం కొనుగోలు అవకతవకలపై సిసి సస్పెన్షన్
అన్నారం లో జరిగిన సంఘటన పై జిల్లా ఉన్నత అధికారుల విచారణ చేసిన పిమ్మట వే టు.
జోరుగా పైరవీలు చేసిన గ్రామములోని, పెద్ద మనుషులు.
తుంగతుర్తి : మండల పరిధిలోని అన్నారం ధాన్యం కొనుగోలు సెంటర్ లో వరి ధాన్యం కొనుగోళ్లపై జరిగిన అవకతవకల తో గ్రామానికి చెందిన కొంత మంది రైతులు తుంగతుర్తి తాసిల్దార్ రాంప్రసాద్ కు ఫిర్యాదు చేసిన మేరకు, జరిగిన సంఘటనపై తాసిల్దార్ పూర్తి విచారణ జరిపి, పంచనామా చేసి, జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక పంపించగా, సంబంధిత శాఖ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి, సిసి సుధాకర్ ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. గ్రామంలోని పెద్ద మనుషులు జోరుగా పైరవీలు చేసినప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, కొనుగోలు కేంద్రాలలో v.b.k లు తమ ప్రవర్తన మార్చుకోవాలని , జిల్లా ఉన్నతాధికారులు కొనుగోలు కేంద్రాన్ని పర్యవేక్షణ చేయవలసిన బాధ్యత ఉందని, మండల రైతులు కోరుతున్నారు.