మూఢనమ్మకాల నిర్మూలన పై సమాజములో పోరాటం

సమాజ సేవలో రాణిస్తున్న ఉమేష్!
మూఢనమ్మకాల నిర్మూలన పై సమాజములో పోరాటం
బానస సూర్యాపేట జిల్లా ప్రచార కార్యదర్శి కొండగడుపుల ఉమేష్
గ్రామాల్లో ప్రజలు మూఢనమ్మకాలను నమ్మొద్దు
మాయలు మంత్రాలు లేవు అంత ప్రజల భ్రమే
నిరుపేద కుటుంబాల 40 మందికి రక్తదానం చేసిన ఘనత ఉమేష్ దే
తుంగతుర్తి : ప్రభుత్వాలు మారుతున్న కొత్త చట్టాలు వెలుగు చూస్తున్న మూఢనమ్మకాల బ్రమాలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో నేనున్నానని సమాజములో మూఢనమ్మకాల నిర్మూలనకై తనవంతు కృషి చేస్తూ, ప్రమాదాల సమయంలో నేనున్నానని ముందుకు వస్తూ ఎంతోమందికి రక్తదానం చేసిన ఘనత…. భారత నాస్తిక సమాజం సూర్యాపేట జిల్లా ప్రచార కార్యదర్శి కొండగడుపుల ఉమేష్.
మండల పరిధిలోని వెంకటి గ్రామానికి చెందిన కొండగడుపుల ఉమేష్ డిగ్రీ పూర్తి చేశాడు. చిన్నతనం నుండే తమ వీధుల్లో ప్రజలు మూఢనమ్మకాలపై అపోహలతో భదలను గమనించేవాడు. దీన్ని నిర్మూలన పై తన వంతు సమాజంపై నీతో పని చేస్తూతూ నిర్మూలించే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించి మ్యాజిక్ కార్యక్రమాలతో విద్యార్థులకు ప్రజలకు నూతన చైతన్యాన్ని నింపుతున్న అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనితోపాటు సుమారు 40 సార్లు ఆపదలో ఉన్న నిరు పేద ప్రజలకు ఉచితంగా రక్తాన్ని కూడా దానం చేసినట్లు పేర్కొన్నారు.
గ్రామాల్లో మూడుబాటలు కలిసేచోట నేటికీ నిమ్మకాయలు, కొబ్బరికాయలు, కోడిగుడ్లు ఉన్నట్లయితే అందరూ చూస్తుండగానే ఆ ప్రదేశానికి వెళ్లి ఇతరులు పెట్టిన సామాగ్రిని తన వెంట వాటిని తీసుకొని ఇంటికి వెళ్లి వండుకొని తింటున్నట్లు తెలిపారు .ప్రపంచంలో రోజురోజుకు సాంకేతిక విజ్ఞాన పరిజ్ఞానం లభిస్తున్నప్పటికీ ప్రజలు మూఢనమ్మకాలపై బాధపడడం విడ్డూరంగా ఉన్నది .
ప్రతి వ్యక్తి ఉన్నత జీవితంలో ధైర్యం ,విశ్వాసం, నమ్మకంతో ముందుకు సాగినప్పుడు మూఢ నమ్మకాలను పారదోలవచ్చు అని తన సందేశాన్ని తెలియజేశాడు .ఏది ఏమైనా ఈ సమాజంలో , ప్రజల్లో మార్పు రావాలని కోరుకుంటూ ప్రభుత్వం దొంగ బాబాల పై నూతన చట్టం తీసుకువచ్చి కేసు నమోదు చేసినప్పుడే కొంతవరకు మూఢ నమ్మకాలను అరికట్టవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ప్రభుత్వం మూఢనమ్మకాల నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతూ ప్రత్యేక చట్టాలు పొందుపరచ వలసిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. మూఢనమ్మకాల నిర్మూలన లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
సూర్యాపేట జిల్లా స్వేరో కోఆర్డినేటర్ కొండగడుపుల ఎల్లయ్య వెంపటి
గ్రామాల్లోని ప్రజలు నేటికీ మూఢనమ్మకాలపై ఆధారపడి లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ అవివేకంగా మారుతున్నారు. నేటికీ మంత్రాలు దయ్యాలు ఉన్నాయి అని అనడం విడ్డూరంగా ఉన్నది ప్రభుత్వం నూతన చట్టాలతో దొంగ బాబాలు కేసులు పెట్టాలని కోరుతున్నాం.
ప్రజల్లో ప్రభుత్వం మూఢనమ్మకాల పై అవగాహన కల్పించాలి
భారత నాస్తిక సమాజం అధికార ప్రతినిధి సుంకర శ్రీనివాస్ వెంపటి ప్రభుత్వం మూఢ నమ్మకం నిర్మాణాలకు నిర్మాణంలో భాగస్వామి అయి నూతన ప్రత్యేక చట్టాలను తీసుకు వచ్చి గ్రామాల్లో విరివిగా అవగాహన కార్యక్రమాలు చేసినప్పుడే ప్రజల్లో అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు ప్రభుత్వం నూతన చట్టాలను రూపొందించాలి.