శాగంరెడ్డి కోటిరెడ్డి ని పరామర్శించిన ఆదెర్ల శ్రీనివాస రెడ్డి

మేళ్లచెరువు మండల వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షులు శాగం రెడ్డి కోటిరెడ్డి కొన్ని రోజులుగా విష జ్వరంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న వైయస్సార్ తెలంగాణ పార్టీ నల్లగొండ జిల్లా కో కన్వీనర్ ఆదెర్ల శ్రీనివాసరెడ్డి మేళ్లచెరువు లోని శాగం రెడ్డి కోటిరెడ్డి నివాసానికి వెళ్లి ప్రస్తుత ఆరోగ్య స్థితి గురించి తెలుసుకొని వారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్ఆర్ తెలంగాణా పార్టీ ఆవిర్భావం నుంచి తన వెన్నంటే ఉండి పలు కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడిన కోటిరెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.