Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అత్యాధునిక అగ్ని పరీక్ష విజయవంతం

అగ్ని క్షపణుల్లో ఇది అధునాతమని వెల్లడి
బాలాసోర్‌ పరీక్ష కేంద్రంలో పరీక్షించిన అధికారులు
బాలాసోర్‌ : ఆధునీకరించిన అత్యాధునిక అగ్ని క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. అగ్ని తరగతి క్షిపణుల్లో ఇది నవతరం క్షిపణి అని తెలిపారు. ఇది 1,000 కిలోవిూటర్ల నుంచి 2,000 కిలోవిూటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదని పేర్కొన్నారు. ఈ క్షిపణి బరువు అగ్ని`3 క్షిపణి బరువులో సగం మాత్రమేనని తెలిపారు.

శనివారం అగ్ని`పీ క్షిపణి ప్రయోగం సందర్భంగా, దీనికి అనేక కొత్త అంశాలను జోడిరచి పరీక్షించినట్లు తెలుస్తోంది. ఇది అణ్వాయుధ సామర్థ్యంగల వ్యూహాత్మక క్షిపణి అని పేర్కొంది. అణ్వాయుధ సామర్థ్యంగల ఈ వ్యూహాత్మక క్షిపణికి అనేక కొత్త సామర్థ్యాలు ఉన్నాయని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. శనివారం నిర్వహించిన పరీక్ష విజయవంతమైందని, ఈ మిషన్‌ లక్ష్యాలను అత్యున్నత స్థాయి కచ్చితత్వంతో చేరుకుందని తెలిపారు

అగ్ని`పీ క్షిపణిని ఈ ఏడాది జూన్‌ 28న రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్‌డీఓ మొదటిసారి పరీక్షించింది. ఈ సందర్బంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ డీఆర్‌డీఓను అభినందించారు. ఈ క్షిపణి పనితీరు అద్భుతంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ క్షిపణిని రైలు మార్గంలో, రోడ్డు మార్గంలో ప్రయోగించవచ్చు. సుదీర్ఘ కాలం నిల్వ చేయవచ్చు. దేశంలోని అన్ని ప్రాంతాలకు దీనిని రవాణా చేయవచ్చు. ఇది రెండు దశల్లో కనిస్టరైజ్‌ చేసిన సాలిడ్‌ ప్రొపెల్లెంట్‌ బ్యాలిస్టిక్‌ మిసైల్‌. క్షిపణిని కనిస్టరైజ్‌ చేయడం వల్ల దానిని ప్రయోగించడానికి పట్టే సమయం తగ్గుతుంది. స్టోరేజ్‌, మొబిలిటీ కూడా మెరుగు పడుతుంది.

ఒడిశాలోని బాలాసోర్‌ వద్ద ఈ మిస్సైల్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడి౦చాయి. అత్యంత కచ్చితత్వంతో మిషన్‌ లక్ష్యాలను చేరుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిరచాయి. ఉదయం 11.06 నిమిషాలకు డీఆర్డీవో ఈ పరీక్ష చేపట్టింది. అగ్రి ప్రైమ్‌ క్షిపణి పరీక్ష సమయంలో.. టెలిమెట్రీ, రేడార్‌, ఎలక్టో ఆప్టికల్‌ స్టేషన్స్‌, డౌన్‌రేంజ్‌ షిప్స్‌ను తూర్ప తీరం వద్ద ట్రాక్‌ చేశారు. అనుకున్నట్లే క్షిపణి ట్రాజెక్టరీ సాగిందని డీఆర్డీవో చెప్పింది.

హై లెవల్‌ అక్యురెసితో అన్ని అబ్జెక్టివ్‌లను అందుకున్నట్లు డీఆర్డీవో వెల్లడిరచింది. అగ్ని ప్రైమ్‌ క్షిపణి.. రెండ దశల సాలిడ్‌ ప్రొపెª`లలెంట్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌. డ్యుయల్‌ నావిగేషన్‌, గైడెన్స్‌ వ్యవస్థలు కూడా ఉన్నాయి. మిస్సైల్‌లో ఉన్న అన్ని అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీలు సెకండ్‌ ప్లయిట్‌ టెస్ట్‌లో సరైన రీతిలో స్పందించినట్లు డీఆర్డీవో చెప్పింది. విజయవతంగా అగ్ని ప్రైమ్‌ మిస్సైల్‌ను పరీక్షించినందుకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శస్త్రవేత్తలను అబినందించారు.

క్షిపణి అద్భుతమైన రీతిలో పనిచేసినందుకు ఆయన అత్యంత సంతోషాన్ని వ్యక్తం చేశారు. మిస్సైల్‌ పరీక్షలో పాల్గొన్న బృందానికి డీఆర్డీవో చైర్మెన్‌ డాక్టర్‌ జీ సతీశ్‌ రెడ్డి ప్రశంసలు తెలిపారు.