గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ శాఖ దాడులు

మండలంలోని పత్తిపాక గ్రామ శివారు లవుడ్యా తండా,పత్తిపాక తండాతో పాటు నెక్కొండ తండా లోని గుడుంబా స్థావరాలపై నర్సంపేట ఎక్సైజ్ శాఖ ఎస్ ఐ వెంకటేశ్వర్ రావు నేతృత్వంలో లో దాడులు జరిపారు ఈ దాడుల్లో 15 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకోగా 100 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. లావుడ్యా తండాకు చెందిన లావుడ్యా సీతమ్మ మరియు న్యాల పద్మ లావుడ్యా మాన్య లపై కేసు నమోదు చేసినట్లు వెంకటేశ్వరరావు తెలిపారు. అలాగే నెక్కొండ తండా లో పంట పొలాల్లో గుడుంబా తయారీ కోసం నాన పెట్టిన 300 లీటర్ల బెల్లం పట్టిక పానకాన్ని పోలీసులు ధ్వంసం చేశారు ఈ దాడుల్లో ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ సర్వర్,సిబ్బంది జలపతి ప్రణవ్,స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.