సోనియాతో డిఎస్ భేటీ..తిరిగి కాంగ్రెస్ గూటికి

తిరిగి కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్దం
రాజ్యసభ సభ్యుడు, మాజీ పిసిసి అధ్యక్షుడు సీనియర్ నేత డి శ్రీనివాస్ త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ మేరకు ఆయన సోనియాలో సంప్రదింపులు జరిపారు. 1989 నుంచి 2015 జులై వరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘంగా పని చేశారు. పలు కీలక పదవులు కూడా అనుభవించారు. రెండు సార్లు పిసిసి అధ్యక్షుడిగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకుని రావడంలో కీలకంగా పనిచేశారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌లో జరిగిన పరిణామాలతో ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి టీఆర్‌ఎస్ పార్టీలోనే కొనసాగారు. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కూడా పని చేశారు. అయితే ఇటీవల కాలంలో డి.శ్రీనివాస్ టీఆర్‌ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే సోనియాగాంధీలో ఆయన చర్చించారు. ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే డి.శ్రీనివాస్ తనయుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ బీజేపీ ఎంపీగా ఉండటం విశేషం.