త్వరలోనే రష్యా, చైనా, భారత్‌ల శిఖరాగ్ర సదస్సు

రష్యా, చైనా, భారత్‌ల శిఖరాగ్ర సదస్సు
త్వరలోనే ఉంటుందన్న కెమ్లిన్
చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సవిూప భవిష్యత్తులో భారత ప్రధాని మోదీ భేటీ అవుతారని రష్యా వెల్లడిరచింది. రష్యా అధ్యక్ష భవన కార్యాలయం దీనిపై ఓ ప్రకటన చేసింది. ఆ భేటీలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా పాల్గొననున్నట్లు తెలిసింది. రష్యా, ఇండియా, చైనా మధ్య త్వరలోనే శిఖరాగ్ర సదస్సు జరగనున్నట్లు రష్యా అధ్యక్ష భవన అధికారి యూరీ ఉషకోవ్ స్థానిక వార్తాసంస్థకు తెలిపారు. అయితే కొన్ని రోజుల క్రితం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఇండియాకు వచ్చి వెళ్లిన విషయం తెలిసిందే. రష్యాతో ఆయుధాల ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో.. మోదీని ఢల్లీిలో పుతిన్ కలిశారు. ఇటీవల పుతిన్, జిన్‌పింగ్ మధ్య జరిగిన వర్చువల్ సమావేశంలో.. రష్యా,
ఇండియా, చైనా మధ్య సహకారం గురించి చర్చ వచ్చిందని, అయితే ఆర్‌ఐసీ నియమావళి ప్రకారం త్వరలోనే ఈ మూడు దేశాల మధ్య సదస్సు జరగనున్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి ఉషకోవ్ తెలిపారు. ఢల్లీికి పుతిన్ వెళ్లిన అంశాన్ని చైనా అధ్యక్షుడికి తెలియజేసినట్లు కూడా ఆయన చెప్పారు.