డెల్డా కంటే 70రెట్లు వేగంగా ఒమిక్రాన్‌ వ్యాప్తి

ప్రభావంపై శాస్త్రవేత్తల అధ్యయనం

కరోనా స్టెయ్రిన్‌పై హాంకాంగ్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. మహమ్మారి తీవ్రతను తెలుసుకునేందుకు అధ్యయనం చేపట్టారు. ఇప్పటి వరకు వచ్చిన వేరియంట్లలో కంటే ఒమిక్రాన్‌తో ఇన్ఫెక్షన్‌ ఎక్కువగా ఉన్నట్లు తేలిందని శాస్త్రవేత్తలు

పేర్కొంటున్నారు. డెల్టా సహా అన్ని వేరియంట్ల కంటే 70 రెట్లు వేగంగా బ్రోంకస్‌(ఊపిరితిత్తుల్లోకి గాలిని పంపే దిగువ శ్వాసకోశంలోని ఓ వాయునాళం)లో వ్యాప్తి చెందగల గుణం ఉందని తెలిపారు.

డెల్టా, ఇతర కరోనా వేరియంట్లతో పోలిస్తే ఊపిరిత్తులపై ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావం తక్కువగానే ఉందని అధ్యయనంలో తేలింది. అందుకే ఇన్ఫెక్షన్‌ తీవ్రంగా మారడం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌ భిన్నమైన వేరియంట్‌ తీవ్రత ఎందుకు తక్కువగా ఉందో తెలుసుకునేందుకు పరిశోధకులు ఎక్స్‌`వీవో (ఇలీ లతిలనీ) కల్చర్‌పై అధ్యయనం చేపట్టారు. హాంకాంగ్‌ విశ్వవిద్యాలయంలోని అసోసియేట్‌ ప్రొపెషర్‌ మైఖేల్‌ చాన్‌ చివై ఆధ్వర్యంలోని బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తి చెందే ఇన్ఫెక్షన్‌గా గుర్తించినా.. మరీ ఎక్కువ ప్రమాదకరమైంది కాదని బృందం పేర్కొంది. ఈ కరోనా కొత్త వేరియంట్‌ సోకిన 24 గంటల తర్వాత డెల్టా, సార్స్‌ కోవ్‌`2 వైరస్‌ల కంటే 70రెట్లు వేగంగా వ్యాప్తి చెందడం ప్రారంభమవుతుందని పరిశోధకులు పేర్కొన్నారు.

ప్రస్తుతానికి ఉన్న శుభవార్త ఏంటంటే ఇతర వైవిధ్యాల కంటే పది రెట్లు తక్కువగా మానవ కణజాలాన్ని ప్రభావితం చేస్తుందని, అలాగే తీవ్రమైన వ్యాధిని అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గిందని పేర్కొన్నారు. అయితే, మహమ్మారి తీవ్రత తక్కువైనా ఎక్కువ మందికి సోకితే మరణాలకు కారణమవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్‌ మైఖేల్‌ చాన్‌ పేర్కొన్నారు. వేరియంట్‌ ప్రభావం మనిషిలోని రోగ నిరోధకశక్తిపై కూడా ఆధారపడి ఉంటుందన్న ఆయన.. తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, దాని వేగవంతమైన పెరుగుదల తీవ్రమైన సమస్యలను కలిగిస్తుందన్నారు. వేరియంట్‌ను నియంత్రించడం చాలా ముఖ్యమైందన్నారు.