దుక్కిటెద్దు పై చిరుతపులి దాడి

– రెండు కొమ్ములు విరిగిపోయి గాయపడిన దుక్కిటెద్దు

-ప్రాణాలతో పారిపోయిన మరో దుక్కిటెద్దు

ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం, గాజులపల్లె గ్రామానికి చెందిన సొల్లేటి సత్తయ్య కు దుక్కిటెద్దు పై గురువారం తెల్లవారుజామున చిరుతపులి దాడి చేసి గాయపరిచింది. సత్తయ్య తన దుక్కిటెద్దులను బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వెంకటాపూర్ ఫారెస్ట్ సమీపంలో మేత మేపి సాయంత్రం కావలి ఇప్ప సమీపంలో పొలం వద్ద దుక్కిటెద్దు లను వేరువేరుగా తాళ్లతో కట్టేసి పశుగ్రాసం వేసి ప్రతి రోజు లాగా ఇంటికి వచ్చాడు గురువారం ఉదయం పొలం వద్దకు వెళ్లి చూడగా చిరుతపులి దాడిలోతాడుతో కట్టివేయబడిన దుక్కిటెద్దు రెండు కొమ్ములు విరిగిపోయి గాయపడి రక్తస్రావంతో ఉన్నది, గట్టితాడుతో కట్టివేయబడిన దుక్కిటెద్దు చిరతపులితో గట్టిగానే ప్రతిగటించడం వల్లే రెండు కొమ్ములు విరిగి ఉన్నట్టు తెలుస్తోంది.మరొక దుక్కిటెద్దు తాడు తెంపుకుని పారిపోయింది. పారిపోయిన ఎద్దు కోసం గ్రామ రైతులు వెతుకుతున్నారు, చిరుతపులి దాడిలో గాయపడి ఉన్న దుక్కిటెద్దు ను వెటర్నరీ వైద్యులు కనుకయ్య తో చికిత్స చేయించారు. అనంతరం రైతు సత్తయ్య గ్రామ సర్పంచ్ కు, ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. ఆయన సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు వెంకటాపూర్ ఫారెస్ట్ లో తప్పించుకుని పారిపోయిన చిరుతపులి జాడలను తెలుసుకుంటున్నారు.చిరుత పులి దాడి లో గాయపడిన దుక్కిటెద్దు యజమాని కుటుంబానికి తగిన పరిహారం ఇప్పిస్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు‌. పశువులను మేతకు తీసుకెళ్లాలంటే పశుపోషకులు, కాపరులు భయాందోళనలకు గురవుతున్నారని, ఉన్నతాధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని జిల్లా అటవీ అధికారులు సూచించారు.వెంకటపూర్ ,పోతిరెడ్డిపల్లె సమీప అడవుల్లో చిరుతపులి తిరుగుతుందని తమకు సమాచారం ఉందని ఒంటరిగా వనంలోకి ఏవరు వెళ్లవద్దని తెలిపారు.