రోహిత్, విరాట్ల మధ్య విభేదాలు నిజమేనా

భారత్ క్రికెట్లో ఏం జరుగుతోంది
ఒకరి కెప్టెన్సీలో మరొకరు ఆడకపోవడంతో అనుమానాలు
గతంలో ఎప్పుడూ లేనంతగా క్రికెట్లో వివాదాలు బయటకు కనిపించనంతగా ఉన్నాయి. ఇద్దరు కెప్టెన్ల నియామకంతో ఇవి మరింత బలపడ్డాయా అన్న అనుమానాలు వస్తున్నాయి. కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య ఏమయ్యిందన్న వార్తలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తి కలిగిస్తు న్నాయి. ఇద్దరు కెప్టెన్ల నియామకమే ఈ పరిస్థితికి దారితీసిందా అన్న అనుమానాలు వస్తున్నాయి.
డిసెంబర్లో జరుగబోయే సౌతాఫ్రికా సిరీస్‌లో టీమిండియా కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు కలిసి ఆడడం లేదు. ఇది కెప్టెన్సీకి సంబంధించిన వివాదమో లేక యాదృచ్ఛికమో.. తెలియలేదు. సిరీస్‌కు ఇద్దరు కెప్టెన్లు వెళతారు కానీ టెస్టు మ్యాచ్‌లు, వన్డేలలో మాత్రం కలిసి ఒక్క మ్యాచ్ కూడా ఆడరు. అలా ఆడకపోవడానికి ఎవరి కారణలు వారు చెబుతున్నారు.
సౌతాఫ్రికా సిరీస్‌లో భాగంగా భారత్ ముందుగా మూడు టెస్టు మ్యాచ్‌లు ఆడాలి. ఆ తరువాత మూడు వన్డే మ్యాచ్‌లు ఆడాలి. కానీ రోహిత్ శర్మ గాయం కారణంగా టెస్టు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. మరోవైపు విరాట్ కోహ్లి వన్డే బృందం నుంచి తన పేరును ఉపసంహరించుకున్నాడు. జనవరిలో తన పాప మొదటి పుట్టినరోజు ఉండడంతో ఆ సమయంలో వన్డేలకు ఆడలేనని విరాట్ ఇప్పటికే బిసిసిఐ అధికారులకు తెలిపాడు.
అయితే డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే టెస్టు మ్యాచ్‌లకు కోహ్లి సారథ్యం వహిస్తుండగా.. జనవరి 19 నుంచి జరిగే వన్డేలకు రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వీరిద్దరూ కారణాలు ఏమి తెలిపినా.. ఒకరి సారథ్యంలో మరొకరు ప్రస్తుతానికి ఆడడం లేదన్న విషయం స్పష్టమయ్యింది.
టీమ్ఇండియా టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ.. గాయం కారణంగా దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరమయ్యాడు. సఫారీ పర్యటనకు ముందు ముంబైలో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఆదివారం రోహిత్ చేతికి గాయమైంది. దీంతో హిట్‌మ్యాన్ మూడు టెస్టులకు అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ వెల్లడిరచింది. అతడి స్థానంలో భారత`’ఎ’జట్టు సారథి ప్రియాంక్ పాంచల్‌కు తొలిసారి టీమ్‌లో చోటు దక్కింది.
దీంతో దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు అతడు అందుబాటులో ఉండటం లేదు. రోహిత్ స్థానంలో ప్రియాంక్ జట్టుతో చేరతాడు’అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. రోహిత్ స్థానంలో లోకేశ్ రాహుల్ టెస్టు జట్టు వైస్‌కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశాలున్నాయి.
ప్రస్తుతానికి టెస్టు సిరీస్‌కే దూరమైన రోహిత్.. జనవరి 19 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్ వరకు కోలుకుంటాడా అనేది అనుమానంగా మారింది. ’దెబ్బ తగిలిన తర్వాత కూడా రోహిత్ బ్యాటింగ్ కొనసాగించాడు. దీంతో గాయం చిన్నదే అయి ఉంటుందని భావించాం. కానీ ఆ తర్వాత దాని ప్రభావం తెలిసింది. ఇలాంటి సమయాల్లో పూర్తి స్థాయిలో కోలుకునేందుకు ఒక్కో సారి నాలుగు వారాల సమయం పడుతుంది. దీంతో అతడు దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు దూరం కావాల్సిందే’అని బీసీసీఐ అధికారి తెలిపారు. రోహిత్ గైర్హాజరీలో రాహుల్‌తో కలిసి మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సెంచూరియన్ వేదికగా ఈ నెల 26న భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.