విలన్‌గా పవర్‌ఫుల్‌ లుక్‌లో ఆది పినిశెట్టి 

‘ఇస్మార్డ్‌ శంకర్‌’ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌.. ’రెడ్‌’ మూవీతో అభిమానుల్ని నిరాశపరిచాడు. డ్యూయల్‌ రోల్‌ చేసినప్పటికీ ఆ సినిమా అంతగా మెప్పించలేకపోయింది. తాజాగా రామ్‌ తెలుగు, తమిళ బైలింగ్విల్‌ మూవీలో నటిస్తున్నాడు. మాస్‌ డైరెక్టర్‌ లింగుసామి దీనికి దర్శకుడు. యాక్షన్‌

థ్రిల్లర్‌ గా ఈ సినిమాకి ’ఉస్తాద్‌’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌ పై శ్రీనివాస చిట్టూరి భారీ బ్జడెట్‌ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతోంది.  ఇందులో పవర్‌ ఫుల్‌ విలన్‌ గా ఆది పినిశెట్టి నటిస్తున్నారు. ఈ రోజు (మంగళవారం) ఆయన పుట్టిన రోజు సందర్బంగా .. ఆయన లుక్‌ ను విడుదల చేశారు మేకర్స్‌.

అల్లు అర్జున్‌ ’సరైనోడు’ సినిమాలో విలన్‌ గా నటించిన ఆదికి మంచి పేరొచ్చింది. అందులో ఆయన పెర్ఫార్మెన్స్‌, మేకోవర్‌ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో కూడా ఆదిపినిశెట్టి మేకోవర్‌ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ లుక్‌ సోషల్‌ విూడియాలో వైరల్‌ అవుతోంది. ప్రముఖ రచయిత సాయిమాధవ్‌ బుర్రా ఈ సినిమాకి డైలాగ్స్‌ రాస్తున్నారు. అలాగే కేజీఎఫ్‌ ్గªట్‌ మాస్టర్స్‌ ద్వయం అంబు` అరివు ఈ సినిమాకి యాక్షన్‌ కొరియో గ్రఫీ చేయడం విశేషం.