తండ్రీకొడుకులతో ఫరియా అబ్ధుల్లా స్పెషల్‌ సాంగ్‌..!

అందాల ముద్దుగుమ్మలు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. వచ్చిన ఏ అవకాశాన్ని జారవిడుచుకోవడం లేదు. స్టార్‌ హీరోయిన్స్‌గా సత్తా చాటుతున్న భామలు కూడా ఐటెం సాంగ్స్‌కి సై అంటుండడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గతంలో రాశి, రంభ, రమ్యకృష్ణ లాంటి వాళ్ళు కూడా స్పెషల్‌ సాంగ్స్‌ చేశారు. కానీ వాళ్ళు హీరోయిన్‌ గా ఫేమ్‌ తగ్గిన తర్వాత చేశారు. స్టార్‌ హీరోయిన్‌ గా ఉన్నప్పుడే ఐటెం సాంగ్స్‌ చేసే ట్రెండ్‌ మొదలుపెట్టింది మాత్రం శ్రియ సరన్‌.

హీరోయిన్‌ తమన్నా కూడా స్టార్‌ హీరోయిన్‌ గా ఉన్నప్పుడే అల్లుడు శీను, కేజీఎఫ్‌, జై లవకుశ సినిమాల్లో ఐటెం సాంగ్స్‌ చేసింది. మరో స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ కూడా ’జనతా గ్యారేజ్‌’ సినిమాలో ఐటెం సాంగ్‌ చేసి మెప్పించింది. హన్సిక ’బిల్లా’లో, శృతి హాసన్‌ ’ఆగడు’లో, అనుష్క ’స్టాలిన్‌’లో, ఛార్మి ’భాయ్‌’ సినిమాలో ఐటెం సాంగ్స్‌ తో రెచ్చిపోయారు. ఇక పూజా హెగ్డేకి కూడా మంచి క్రేజ్‌ ఉన్నప్పుడే ’రంగస్థలం’ సినిమాలో జిగేలు రాణి ఐటెం సాంగ్‌ తో కుర్రకారుని హీటెక్కించింది.

స్టార్‌ హీరోయిన్‌ సమంత కూడా ఇప్పుడు పుష్ప మూవీలో ఓ ఐటెం సాంగ్‌ చేసింది. తాజాగా జాతిరత్నాలు చిత్రంతో మంచి హిట్‌ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించిన ఫరియా అబ్ధుల్లా.. అక్కినేని హీరోలు నాగార్జున, నాగ చైతన్యలతో చిందులేసింది. బంగార్రాజు పార్టీ సాంగ్‌ లో వీరు డ్యాన్స్‌లు చేయగా, సెంబర్‌ 17న ఈ సాంగ్‌ టీజర్‌ రిలీజ్‌ కానుందని తెలిపారు. పోస్టర్‌ చూస్తుంటే మాత్రం ఫరియాతో తండ్రీకొడుకులు రెచ్చిపోయి చిందేశారని అర్థమవుతోంది. ఏదేమైన క్రేజ్‌ పీక్స్‌లో ఉన్నప్పుడు ఇలా స్పెషల్‌ సాంగ్స్‌తో సందడి చేయడం గొప్ప విషయమే అని చెప్పాలి.