Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సీజనల్‌ వ్యాధుల నివారణకు ఇదే మార్గం

ప్రజల భాగస్వామ్యంతోనే పారిశుద్యం సాధ్యం

వ్యాధులకు పారిశుద్య నిర్వహణా లోపం

రాష్ట్రంలో గతంలో ప్రజలు డెంగీ, తదితర వైరల్‌ జ్వరాలతో ఇబ్బందులు పడేవారు. కరోనా కారణంగా ఇప్పుడా భయం తగ్గింది. అయితే కరోనా వల్ల ఓ మంచి మాత్రం జరిగింది. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతలకు అలవాటు పడుతున్నారు. ఇది కొనసాగితే విషజ్వరాలు లేదా, అంటువ్యాధులు ప్రబలవని వైద్యనిపుణులు అంటున్నారు.  ప్రతి ఏటా వానాకాలంలో అంటు వ్యాధులు ప్రబలడం సర్వసాధారణంగా మారింది. చలికాంల వచ్చే సరికి స్వైన్‌ ఫ్లూ లాంటి వ్యాధులు విజృంభిస్తుంటాయి.

పట్టణాలు,పల్లెలు అనే తేడా లేకుండా  స్వచ్ఛంగా ఉంచాలని పదేపదే ప్రచారం చేస్తున్నా ప్రజలు పట్టించుకోవడం లేదు. ఎవరికి వారు తమకేంటన్న భావనతో అపరిశుభ్రతకు కారణమవుతున్నారు. అయితే కరానె పరిస్తితి కారణంగా ఇప్పుడు ప్రజలకు గుణపాఠం వచ్చిందనే చెప్పాలి. అయితే ఇది ఎంతకాలం అన్నది కూడా చూడాలి. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో ప్రజల నిర్లక్ష్యం కారణంగా నగరం కంపు కొడుతోంది. మురుగునీటి పారుదల సక్రమంగా లేకపోవడం వల్ల ఏలూరులో వింతవ్యాధి ఇటీవల ప్రజలను తీవ్రంగా భయపెట్టింది. ఇకపోతే పరిసరాలను పరిశుభ్రంగా  ఉంచుతున్నామని నాయకులు చెపుతున్నా వాస్తవం వేరే రకంగా కనిపిస్తోంది.

పారిశుద్ధ్య లేమి కారణంగానే ఇటువంటి వ్యాధులు ప్రబలు తున్న విషయం సుస్పష్టం. ఈ క్రమంలో ప్రజలు పురపాలకసంస్థపై ధ్వజమెత్తుతున్నారు. అపరిశుభ్రత కారణంగా దోమలు విజృంభించడం, వింతవ్యాధులు విజృంభించడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నది.  సీజనల్‌ వ్యాధుల నివారణ ప్రజల భాగస్వామ్యం తోనే సాధ్యమవుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు. బహిరంగ ప్రదేశాలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు దోమల నివారణతో పాటుగా పారిశుద్ధ్య నిర్వహణ చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో పారిశుద్ధ్య నిర్వహణ పైన దృష్టి సారించి, ప్రభుత్వ ప్రయత్నాలతో కలిసి రావాలి.ముఖ్యంగా దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు సొంత ఇళ్లలోని పారిశుద్యం అత్యంత కీలకమైన అంశం. ఇళ్ళలో పారిశుద్ధ్య నిర్వహణ కోసం ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాల్సి ఉంది. ఎప్పటికప్పుడు ప్రజలను చైతన్యవంతం చేసి, పారిశుద్ద్య నిర్వహణలో వారిని భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వ అధికారులు, పురపాలక ప్రతినిధులు కృషి చేస్తూనే ఉన్నారు.

ఇళ్ళలో పారిశుధ్య నిర్వహణ చేపట్టి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని పదేపదే కోరుతున్నారు.  ముఖ్యంగా దోమల వృద్ధికి అవకాశం ఉన్న ఉన్న నీటి తొట్లు, నీటి నిలువ ప్రదేశాల్లో నీటిని తొలగించే చర్యలు తీసుకోవాలన్నారు. దీంతోపాటు ఇంటి మూలల్లో ఉన్న ఉపయోగంలో లేని వస్తువులను తీసివేసి, దోమల లార్వా వృద్ధికి అవకాశం లేకుండా చేసే చర్యలను చేపట్టాలన్నారు.  ప్రతి ఒక్కరూ ఇంటి పారిశుద్ధ్య నిర్వహణ పైన పైన దృష్టి సారించి సీజనల్‌ వ్యాధుల బారి నుంచి కాపాడుకునే ప్రయత్నం ప్రారంభిం చాలని పిలుపునిచ్చారు.

ముఖ్యంగా ఇళ్ళ ముందు కానీ లేదా ఇంటి లోపల నీటి నిలువ ఉండే ప్రాంతాల్లో నీటిని తొలగించే ప్రయత్నం చేయడం లేదా వాటిపైన నూనెను చల్లడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.  దీంతోపాటు ఇళ్లలో ఉన్న పనికిరాని లేదా ఉపయోగం లేని లేని వస్తువులను తొలగించుకోవాలని కోరారు. అప్పుడేసీజనల్‌ వ్యాధులను రాకుండా నిరోధించగలమని అన్నారు. కాలువల్లో వాడిపడేసిన వ్యర్తాలను, స్లాస్టిక్‌ను పడేయడం వల్ల కూడా మురికినీరు నిలిచి పోతోంది. దీనికి ప్రజలే బాధ్యత వహించాలి.