కోహ్లీ లేకుండానే టీమ్ ఇండియాకు టైటిల్

టీంను నడిపించగల సత్తా రోహిత్ కు ఉంది
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
టీమ్ ఇండియా క్రికెట్‌లో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. టీ20తో పాటు వన్డే కెప్టెన్‌గా కూడా రోహిత్ శర్మ బాధ్యతలు స్వీకరించాడు.ఈ నేపధ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బీసీసీఐ టీమ్ ఇండియాలో చాలా మార్పులు చేసింది. విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. టీ20ల్లో ముందు కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమించిన బీసీసీఐ..తాజాగా వన్డే పగ్గాలు కూడా రోహిత్ శర్మకే అప్పగించింది. విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్ బాధ్యతల్నించి తొలగించడం అనూహ్య పరిణామం. అందరికీ షాక్‌కు గురి చేసింది. ఈ వ్యవహారం వెనుక బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పాత్ర ఉందనే విషయం అతడి మాటలతోనే వ్యక్తమైంది.
సౌరవ్ గంగూలీ ఒత్తిడి మేరకే విరాట్ కోహ్లీని తొలగించినట్టు తెలుస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి. రోహిత్ శర్మపై సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. టీమ్ ఇండ్షియను విజయపథంలో నడిపించగల సత్తా రోహిత్ శర్మకు ఉందని..ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు 5 సార్లు టైటిల్ అందించాడాని గంగూలీ కొనియాడాడు. అందుకే సెలెక్షన్ కమిటీ రోహిత్ శర్మను ఎంపిక చేసిందని..విజయం కోసం రోహిత్ శర్మ కొత్త వ్యూహాలు రచిస్తాడని చెప్పాడు. రోహిత్‌పై తనకు పూర్తి నమ్మకముందని గంగూలీ ప్రశంసించాడు. ఐపీఎల్ కెప్టెన్‌గా అతడి రికార్డు అద్భుతమని చెప్పాడు. కోహ్లీ గైర్హాజరీలో 2018లో ఆసియా కప్‌కు సారధ్యం వహించి.. ట్రోఫీని సాధించిపెట్టాడన్నాడు. కోహ్లీ లేకుండా టైటిల్ గెలిచి తన సత్తా ఏంటనేది చెప్పాడన్నాడు.