టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న జడేజా!
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వరుసగా గాయాల పాలవుతున్న ఈ స్టార్ ఆల్‌రౌండర్.. సుదీర్ఘకాలం కెరీర్ కొనసాగించేందుకు టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని భావిస్తున్నట్లు సమాచారం. టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుని వన్డే, టీ20 ఫార్మాట్లపై దృష్టి సారించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. స్వయంగా ఈ విషయాన్ని జడేజా సన్నిహితుడు ఒకరు దైనిక్ జాగరణ్ అనే పత్రికకు తెలిపారు.
సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో జడేజా మోకాలి గాయానికి గురయ్యాడు. దాంతో ముంబై వేదికగా జరిగిన రెండో టెస్ట్ అతను ఆడలేదు.అయితే అతని మోకాలి గాయం తీవ్రత నేపథ్యం సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించారు. ఇక మోకాలి శస్త్రచికత్స అనంతరం కోలుకోవడానికి దాదాపు 6 నెలల సమయం పడుతుంది. దీంతో దక్షిణాఫ్రికా పర్యటనకు కూడా దూరమయ్యాడు. ఈ క్రమంలోనే సుదీర్ఘకాలంపాటు కెరీర్ కొనసాగించేందుకు జడేజా ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడని అతని సన్నిహితులు తెలిపారు. ‘వరుస గాయాలవుతున్న నేపథ్యంలో రవీంద్ర జడేజా కీలక నిర్ణయం తీసుకున్నాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన ఫస్ట్ టెస్ట్‌లో అతనికి మోకాలి గాయమైంది. అది తీవ్రమైన గాయమవ్వడంతో శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఈ సర్జరీ అనంతరం జడేజా పూర్తిగా కోలుకోవడానికి 6 నెలల సమయం పడుతుంది. దాంతో అతను సౌతాఫ్రికా పర్యటనతో పాటు వచ్చే ఏడాది శ్రీలంకతో జరిగే సిరీస్‌లకు కూడా దూరం కానున్నాడు. మళ్లీ ఐపీఎల్ 2022 సీజన్ సందర్భంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడాలని జడేజా భావిస్తున్నాడు’అని సదరు వ్యక్తి తెలిపాడు.
ఇప్పటి వరకు 57 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన జడేజా 232 వికెట్లు, 2,195 పరుగులు సాధించాడు. బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన జడేజా.. లోయరార్డర్‌లో విలువైన పరుగులు చేయగలడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇంగ్లండ్ పర్యటనలో స్పెషలిస్ట్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను కాదని జడేజానే నాలుగు టెస్ట్‌లు ఆడిరచడానికి ప్రధాన కారణం కూడా అతని బ్యాటింగే. ఇలాంటి ఆటగాడు దూరమైతే భారత్‌కు లోటే. అయితే అతి త్వరలోనే జడేజా తన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడి౦చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.