గ్లామర్‌లోనూ దూసుకెళుతున్న పూజాహెగ్డే
టాలీవుడ్ టాప్ మోస్ట్ భామల లిస్టులో ముందుగా కనిపించే పేరు పూజా హెగ్డే. తెలుగుతో పాటు తమిళంలోనూ స్టార్ హీరోల సరసన నటిస్తూ సత్తా చాటుకుంటోంది బుట్టబొమ్మ. ప్రస్తుతం ప్రభాస్ సరసన రాధేశ్యామ్, చరణ్ సరసన ఆచార్య సినిమాల్లో నటిస్తోన్న ఈ సుందరి.. తమిళంలో దళపతి విజయ్ తో బీస్ట్ మూవీలో కూడా నటిస్తోంది. ఇంకా మరికొన్ని సినిమాలకు ఆమె సైన్ చేసింది. ఇదిలా ఉంటే.. పూజాకి మరో వ్యాపకం సోషల్ విూడియా. అక్కడ ఆమెకి భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. నిత్యం తన గ్లామరస్ ఫోటోలతో నెటిజెన్స్‌కు కనువిందు చేస్తూ ఉంటుంది. ఈ మధ్య వరుస ఫోటో షూట్స్ తో కుర్రకారుకు ఊపిరి సలపనివ్వడం లేదు ఈ చిన్నది.
తాజాగా పూజా హెగ్డే నల్లకోక, స్లీవ్ లెస్ రైక కట్టుకొని గ్లామరస్ పోజులిచ్చింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ విూడియాను షేక్ చేస్తున్నాయి. బ్లాక్ సీత్రూ చీర అవడంతో ఈ ఫిక్స్ కు మరింత అట్రాక్టివ్ గా కనిపిస్తున్నాయి. ఈ ఫోటోస్ కు మూడు బ్లాక్ హార్ట్ ఎమోటికన్‌లు పెట్టి తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేస్తూ.. సింపుల్ అనే కేప్షన్ ఇచ్చింది. దీంతో ఈ ఫోటోస్ పై ఓ రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. ఓ అభిమాని ఆమెను అందమైన నారీ అంటూ పొగిడేశాడు. మొత్తం విూద బట్టుబొమ్మ ఇప్పుడు నల్లకోక కట్టిన అందాల సీతాకోకచిలుక అయిపోయింది.