తమన్నాతో జతకట్టిన సత్యదేవ్
టాలీవుడ్ యాక్టర్ సత్యదేవ్, తమన్నా కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం గుర్తుందా సీతాకాలం .. లాక్‌డౌన్‌కు ముందే షూటింగ్ షురూ చేసిన ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. చాలా రోజుల తర్వాత మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ విడుదల చేశారు. 2022 ఫిబ్రవరిలో గుర్తుందా సీతాకాలం చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కన్నడలో సూపర్ హిట్‌గా నిలిచిన లవ్ మాక్‌టెయిల్ చిత్రానికి ఇది తెలుగు రీమేక్. ఈ చిత్రాన్ని నాగశేఖర్ డైరెక్ట్ చేస్తుండగా..ఎంఎం కీరవాణి కుమారుడు కాలభైరవ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటీవలే సీటీమార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన తమన్నా మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళాశంకర్ లో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. దీంతోపాటు వెంకీ, వరుణ్ తేజ్ మూవీ ఎఫ్ 3లో నటిస్తుండగా..షూటింగ్ పూర్తి చేసుకుంది. హిందీలో భోలే చుడియాన్, ఎª`లాన్ ఏ ఎª`లాన్ బీ చిత్రాలు చేస్తోంది. దటీజ్ మహాలక్ష్మి సినిమాలో నటిస్తుండగా..ఈ ప్రాజెక్టు ప్రస్తుతానికి డైలామాలో పడ్డది.