రాధేశ్యామ్‌కు జపాన్‌లోనూ క్రేజీ
సాధారణంగా పాన్ ఇండియా సినిమాలకు.. ఇండియా వైడ్ గానే ప్రచారం జరుగుతుంటుంది. విడుదలయ్యే అన్నిభాషల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటుందది. అయితే ప్రభాస్ పాన్ ఇండియా సినిమా ’రాధేశ్యామ్’ ప్రచార తీరే వేరు. ఈ సినిమాకి ఇండియా వైడ్ గా ప్రచారం జరుగుతున్నప్పటికీ.. అదనంగా జపనీస్ ప్రచారం కూడా ఊపందుకుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ ఫాలోయింగ్ జపాన్‌లో ఓ రేంజ్ లో పెరిగిపోయింది. సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత జపాన్‌లో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న హీరో ప్రభాసే అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ప్రభాస్ కోసం జపాన్ నుంచి హైదరాబాద్ వచ్చి సెల్ఫీలు దిగి ఆనందంగా తమ దేశానికి వెళ్ళిపోయే బ్యాచ్ కూడా ఉన్నారు. ప్రభాస్ సినిమా ఏది రిలీజైనా.. జపాన్ ఫ్యాన్స్ యాక్టివేట్ అయిపోతారు. తమ హీరో సినిమా వస్తోందంటూ సోషల్ విూడియాలో తెగ హడావిడి చేసేస్తుంటారు. ఇప్పుడు ’రాధేశ్యామ్’ సినిమాకి కూడా జపనీయుల కోలాహలం మొదలైంది. తమదైన శైలిలో ఈ సినిమాకి ప్రచారం చేస్తున్నారు. ఈ సినిమాలోని పాటలు పాడుతూ.. డ్యాన్సులు చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ’రాధేశ్యామ్’ టైటిల్ ను తామే గీసి పబ్లిష్ చేస్తున్నారు. ’రాధేశ్యామ్’ టీజర్ కు జపాన్ భాషలో రివ్యూలు పెట్టారు. కేవలం ప్రభాస్ సినిమాలకు మాత్రమే దక్కిన ఫ్రీ పబ్లిసిటీ ఇది. మరి ’రాధేశ్యామ్’ సినిమాను జపనీస్ సబ్ టైటిల్స్ తో విడుదల చేస్తారేమో. మొత్తం విూద ’రాధేశ్యామ్’ జ’పాన్’ ఇండియా సినిమా అయిపోయింది.