నేడు శ్యామ్ సింగరాయ్ ట్రైలర్ విడుదల

నేచురల్ స్టార్ నానీ, సాయిపల్లవి జంటగా.. కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పీరియాడికల్ మూవీ ’శ్యామ్ సింగరాయ్’. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఈనెల 24న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది. బెంగాలీ బాబు గా నానీ మేకోవర్ ఆకట్టుకుంటోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన లభించింది. అలాగే.. ఇదివరకు విడుదలైన శ్యామ్ సింగరాయ్ చిత్రానికి సంబంధించిన సింగిల్స్ కూడా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ కు సమయం ఆసన్నమైంది. 14న మంగళవారం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఈ సందర్బంగా ఓ ప్రత్యేక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. నానీ, సాయిపల్లవిల ఫ్యామిలీ ఫోటో ఆకట్టుకుంటోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సత్యదేవ్ జంగా కథ అందించారు. మరి ఈ సినిమా నానీకి ఏ స్థాయిలో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.